Begin typing your search above and press return to search.

వైరల్‌ అవుతోన్న చరణ్‌, శ్రియా పాత వీడియో!

ఈ వీడియో లో రామ్‌ లుక్ ను చూస్తూ ఉంటే ఇంకా చిరుత సినిమా కూడా చేసి ఉన్నట్లు అనిపించడం లేదు

By:  Tupaki Desk   |   26 Dec 2023 1:30 PM GMT
వైరల్‌ అవుతోన్న చరణ్‌, శ్రియా పాత వీడియో!
X

రామ్ చరణ్‌, శ్రియా సరన్‌ జంటగా ఏ సినిమాలో నటించలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీరి కాంబో సీన్‌ చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తోంది. చాలా ఏళ్ల క్రితం చరణ్ మరియు శ్రియా లు కలిసి చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవ్వడం ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఓల్డ్‌ ఈజ్ గోల్డ్‌ అన్నట్లుగా చాలా మంది షేర్‌ చేస్తున్నారు.

ఈ వీడియో లో రామ్‌ లుక్ ను చూస్తూ ఉంటే ఇంకా చిరుత సినిమా కూడా చేసి ఉన్నట్లు అనిపించడం లేదు. చిరుత సినిమా లో నటించడం కోసం యాక్టింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ వీడియోను తీసి ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ లో కాస్త మార్పు వచ్చినట్లుగా అనిపిస్తోంది.. కానీ శ్రియా సరన్‌ అప్పుడు ఎంత అందంగా కనిపించిందో ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఓల్డ్ వీడియో ను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి సినిమా చేశారా.. అది కూడా ఓ రొమాంటిక్ సన్నివేశం కూడా వీరిద్దరి మధ్య ఉందా అంటూ చాలామంది ఇప్పుడు మాట్లాడుకుంటూ, గూగుల్ ను అడిగేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే వీరిద్దరూ కలిసి నటించలేదు. కానీ యాక్టింగ్ స్కూల్‌ లో లేదా యాక్టింగ్‌ ప్రాక్టీస్ సందర్భంగా ఈ సన్నివేశం క్రియేట్‌ అయ్యి ఉంటుంది.