Begin typing your search above and press return to search.

RC 17: హై వోల్టేజ్ కాంబినేషన్.. ఇట్స్ అఫీషియల్!

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ చేస్తాడనే టాక్ బయటకి వచ్చింది

By:  Tupaki Desk   |   25 March 2024 12:06 PM GMT
RC 17: హై వోల్టేజ్ కాంబినేషన్.. ఇట్స్ అఫీషియల్!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా సినిమాకి తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లి కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఏకంగా 400 కోట్లతో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభం అయ్యింది.

ఏప్రిల్ లేదా మే నెల నుంచి RC16 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ చేస్తాడనే టాక్ బయటకి వచ్చింది. సుకుమార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. పుష్ప ది రూల్ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుందనే మాట వినిపించింది. అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC17 మూవీ ఎనౌన్సమెంట్ ఉంటుందని అందరూ భావించారు.

అనూహ్యంగా హొలీ రోజున ఈ సినిమాని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్, చరణ్, దేవిశ్రీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే రెండో సినిమా ఇది కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ రేంజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లి కాన్సెప్ట్ తో నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరులో మూవీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి 2025లో ఆఖరులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నట్లు స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ తో చేయబోయే మూడో పాన్ ఇండియా మూవీగా RC17 ఉండబోతోంది.

రంగస్థలం తర్వాత మరోసారి చరణ్ సుక్కు, దేవిశ్రీ కాంబోలో మూవీని మైత్రీ చేయబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ తో ఈ చిత్రాన్ని సుకుమార్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారని మేకర్స్ స్పష్టం చేశారు. పుష్ప ది రూల్ ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారితే నెక్స్ట్ RC17 ప్రాజెక్ట్ పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.