Begin typing your search above and press return to search.

చరణ్ సినిమాలో బ్యాడ్‌ యానిమల్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్‌ చేంజర్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:57 AM GMT
చరణ్ సినిమాలో బ్యాడ్‌ యానిమల్‌
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్‌ చేంజర్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఇంకా పూర్తి అవ్వక ముందే బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక భారీ పాన్‌ ఇండియా మూవీని చేసేందుకు చరణ్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

బుచ్చి బాబు ఇప్పటికే నటీ నటుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్‌ కి జోడీగా నటించేందుకు గాను జాన్వీ కపూర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో కీలకమైన విలన్ రోల్‌ కి గాను బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బాబీ డియోల్‌ కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఒక టాలీవుడ్‌ సినిమాకు కమిట్ అయిన బాబీ డియోల్‌ ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా కీలక పాత్ర లో నటించేందుకు గాను కమిట్ అయ్యాడని సమాచారం అందుతోంది.

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందబోతున్న చరణ్‌, బుచ్చిబాబు సినిమా షూటింగ్‌ ను ఈ సమ్మర్‌ లో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది లో సమ్మర్ కానుకగా లేదంటే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని బుచ్చి బాబు పట్టుదలతో ఉన్నాడు.

యానిమల్‌ సినిమాలో హీరో రణబీర్ కపూర్ కి ఏమాత్రం తగ్గకుండా బాబీ డియోల్‌ నటించాడు. కనిపించింది కొద్ది సమయం అయినా కూడా బాబీ డియోల్‌ అత్యంత క్రూరమైన పాత్రలో నటించి మెప్పించాడు. అందుకే ఆయనతో కలిసి సినిమాలను చేసేందుకు స్టార్‌ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.