Begin typing your search above and press return to search.

RC 16లో కూడా.. అదే ఫార్మాట్

మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడంట. అది కూడా తండ్రికొడుకులుగానే నటించనున్నట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   31 Aug 2023 5:51 AM GMT
RC 16లో కూడా.. అదే ఫార్మాట్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అలాగే ఈ మూవీ కోసం అన్ని భాషల నుంచి క్యాస్టింగ్ ని ఖరారు చేసే పనిలో ఉన్నారు.

రీసెంట్ గా RC 16 ప్రీప్రొడక్షన్ వర్క్ కోసం ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. దీంతో క్యాస్టింగ్ సెలక్షన్ తో పాటు మిగిలిన ప్రీప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక జోరందుకోనున్నాయి. జాన్వీ కపూర్ ని ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లోనే ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ టాక్ ఒకటి తెరపైకి వచ్చింది.

మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడంట. అది కూడా తండ్రికొడుకులుగానే నటించనున్నట్లు తెలుస్తోంది. ఒకటి ఏజ్ ఎక్కువ ఉన్న పాత్ర కాగా మరో రోల్ లో యువకుడిగా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శంకర్ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ తండ్రికొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి పొలిటికల్ లీడర్ పాత్ర కాగా మరొకటి ఐపీఎస్ ఆఫీసర్ రోల్.

ఈ రెండు పాత్రలని చరణ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలని మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు RC 16 కోసం కూడా మరో సారి డ్యూయల్ రోల్ పోషించడం అంటే సాహసమనే చెప్పాలి. అయితే కథ పరంగా రెండు భిన్నమైన మార్గాలలో ఉంటుంది కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి తాజాగా తెరపైకి వచ్చిన ప్రచారంలో వాస్తవమెంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసే వరకు వెయిట్ చేయాలి.

ఉప్పెన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు చాలా ఇష్టపడి రాసుకున్న కథ ఇది. దీనిపై దర్శకుడు చాలా కసితో ఉన్నారు. కచ్చితంగా బలమైన ఎమోషన్స్ తో ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తారని చెప్పొచ్చు. త్వరలో క్యాస్టింగ్ ఎవరనేది కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. డిసెంబర్ లో RC 16 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.