Begin typing your search above and press return to search.

RC 16: స్క్రిప్ట్ కోసమే నాలుగేళ్ళు

దీంతో ఫుల్ హ్యాపీ మూడ్ లో తన నెక్స్ట్ మూవీకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 4:55 AM GMT
RC 16: స్క్రిప్ట్ కోసమే నాలుగేళ్ళు
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16 మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా ఎనౌన్స్ అయిపొయింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రెండు నెలలు గ్యాప్ తీసుకొని RC 16 మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. బుచ్చిబాబు సానా ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నాడు.

దీంతో ఫుల్ హ్యాపీ మూడ్ లో తన నెక్స్ట్ మూవీకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉప్పెన సినిమాకి అవార్డు రావడంతో బుచ్చిబాబుపై రామ్ చరణ్ సినిమా విషయంలో మరింత బాధ్యత పెరిగింది. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సినిమా కాబట్టి కచ్చితంగా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.

ఇదే విషయాన్ని బుచ్చిబాబు కూడా చెప్పారు. రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఇది తనకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని, నాలుగేళ్లు ఈ స్క్రిప్ట్ పై చాలా సీరియస్ గా వర్క్ చేసాను. సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలని నిర్మాతలు ప్రకటిస్తారు. అంత వరకు వెయిట్ చేయండి అంటూ బుచ్చిబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

బుచ్చిబాబు కాన్ఫిడెన్స్ చూస్తుంటే కచ్చితంగా రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అనే మాట వినిపిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథలు చాలా వరకు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ RC 16 చిత్రానికి వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేయబోయే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే దిల్ రాజుకి ఈ మూవీ రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ లేదు. డైరెక్టర్ శంకర్ ఫినిష్ చేసి ఇచ్చిన తర్వాతనే రిలీజ్ గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది.