Begin typing your search above and press return to search.

RC16లో ర‌వీనా వార‌సురాలు.. ఇందులో నిజ‌మెంత‌?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన‌' బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Oct 2023 5:33 AM GMT
RC16లో ర‌వీనా వార‌సురాలు.. ఇందులో నిజ‌మెంత‌?
X

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన‌' బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లం బ్యాన‌ర్ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఇటీవ‌ల చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ క‌థానాయిక‌ను ఫైన‌ల్ చేసార‌ని, ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా త‌డానీని ఎంపిక చేసార‌ని కూడా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

తెలుగు మీడియాలు స‌హా హిందీ మీడియాల్లోను ఈ క‌థ‌నాలు హైలైట్ అయ్యాయి. అయితే నిజంగానే డెబ్యూ న‌టి రాషాను చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేసారా? అంటే దీనికి ఎలాంటి ఆధారం లేదు. మైత్రి సంస్థ అధికారికంగా ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఈ పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయి? అన్న‌ది ఆరా తీస్తే దానివెన‌క అస‌లు కార‌ణం తెలిసింది.

బాలీవుడ్ నటి రవీనా టాండన్, నిర్మాత అనిల్ తడానీల కుమార్తె రాషా తడానీ గత వారం హైదరాబాద్ వచ్చారు. మైత్రి మూవీ మేక‌ర్స్ కార్యాల‌యంలో ఆడిష‌న్స్ లోను పాల్గొన్నారు. రాషాతో పాటు ప‌లువురు ఆడిష‌న్స్ లో ఉన్నారు. అయితే రాషాను కేవ‌లం చ‌ర‌ణ్ మూవీ కోస‌మే ఆడిష‌న్ చేసారా? అన్న‌దానిపై ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ స‌మాచారం లేదు. మైత్రి సంస్థ‌లో కొన్ని భారీ చిత్రాలు తెర‌కెక్క‌నున్నాయి. అలాగే యువ‌హీరోల‌తోను సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. రాషా ఎంపికైతే ఏ సినిమాలో న‌టిస్తుంది? హీరో ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌టికి ఇంకా స‌స్పెన్స్.

ఒక‌వేళ చ‌ర‌ణ్ స‌ర‌స‌న నాయిక‌గా ఎంపిక చేసి ఉంటే.. మైత్రి సంస్థ దానిని అధికారికంగా వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌లో టెస్ట్ షూట్ కోసం రాషా తడాని అటెండ్ అవ‌డంతోనే ఈ గంద‌ర‌గోళం త‌లెత్తింది. దీనిపై మైత్రి అధినేత‌లు క్లారిటీనివ్వాల్సి ఉంది. మ‌రోవైపు ర‌వీనా టాండ‌న్ టాలీవుడ్ లో నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న బంగారు బుల్లోడు చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 90ల‌లో ప‌లు బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన ర‌వీనా టాండ‌న్.. అమితాబ్ ప్ర‌ధాన పాత్ర‌లో పూరి తెర‌కెక్కించిన బుడ్డా హోగా తేరా బాప్ చిత్రంలోను న‌టించారు.