Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ న్యూ కాంబో.. నిజమైతే కిక్కే కిక్కు

ప్రస్తుతం ముంబైలో ఉన్న రామ్ చరణ్ తో రాజ్ కుమార్ స్టోరీ డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ఓక ఇంటరెస్టింగ్ పాయింట్ చరణ్ కి వినిపించారంట.

By:  Tupaki Desk   |   5 Oct 2023 7:50 AM GMT
రామ్ చరణ్ న్యూ కాంబో.. నిజమైతే కిక్కే కిక్కు
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శాకత్వంలో రామ్ చరణ్ మూవీని సెట్స్ పైకితీసుకొని వెళ్లబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో బుచ్చిబాబు మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో మైత్రీ మూవీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిటౌన్ లో ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ.

రాజ్ కుమార్ హిరానీ సినిమాలంటే కమర్షియల్ తో పాటు మంచి మెసేజ్ ఒరియాంటెడ్ కథలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా డుంకీ సినిమా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం తర్వాత రాజ్ కుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ చేయాలని ఆలోచిస్తున్నారని టాక్ మొదలైంది.

ప్రస్తుతం ముంబైలో ఉన్న రామ్ చరణ్ తో రాజ్ కుమార్ స్టోరీ డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ఓక ఇంటరెస్టింగ్ పాయింట్ చరణ్ కి వినిపించారంట. ఆ స్టోరీ లైన్ చరణ్ కి నచ్చిందని, ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ బిటౌన్ లో నడుస్తోంది. ఈ న్యూస్ మాత్రం నిజమైతే కచ్చితంగా ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

అయితే రాజ్ కుమార్ స్టోరీలైన్స్ అన్ని కూడా సమాజంలో నుంచి వస్తాయి. బీభత్సమైన హీరోయిజం పాత్రలలో ఉండదు. కేవలం హీరో క్యారెక్టర్ ఆ సామాజిక సమస్యలపై సెటైరికల్ గా ఫైట్ చేసే ఒక సామాన్యుడి తరహాలోనే ఉంటుంది. ఇలాంటి పాత్రకి రామ్ చరణ్ ఎంత వరకు ఒప్పుకుంటాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.