Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ ప్రాజెక్టులు.. ఓ ప్లాన్ సెట్టయ్యింది

దర్శకుడు శంకర్ మరో వైపు ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 12:50 PM GMT
రామ్ చరణ్ ప్రాజెక్టులు.. ఓ ప్లాన్ సెట్టయ్యింది
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత తదుపరి సినిమాల విషయంలో మరింత వేగాన్ని పెంచాలని అనుకున్నారు. తండ్రితో ఆచార్య సినిమా వేగంగా చేసినప్పటికీ అది తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అలా జరగకూడదు అని మెగా పవర్ స్టార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కానీ ఊహించని విధంగా గేమ్ ఛేంజర్ సినిమా పనులు ఆలస్యంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ మరో వైపు ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. ఇక రాంచరణ్ లిస్టులో బుచ్చిబాబుతో కూడా RC 16 సినిమాను ఈపాటికే మొదలు పెట్టాల్సింది.

కానీ గేమ్ ఛేంజర్ వల్ల రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేస్తున్నాడు. అయితే మొత్తానికి ఇటీవల రాంచరణ్ తన భవిష్యత్తు ప్రాజెక్టులపై ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ 2024 ఫిబ్రవరి సమయానికి ఫినిష్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట.

ఎట్టి పరిస్థితిలోనూ మార్చిలోపల గేమ్ ఛేంజర్ పనులన్నీ పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో బుచ్చిబాబు ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలి అని అనుకుంటున్నాడు. ఇక మార్చి చివరలోనే రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 16వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.

ఇక ఆ సినిమా షూటింగ్ ఏడాది టైంలోనే ఫినిష్ చేయాలని మరొక టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఆ సినిమాను 2025 సమ్మర్లో విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ ను 2024 అక్టోబర్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ లిస్టులో సుకుమార్ తో కూడా ఓ ప్రాజెక్టు చేయాల్సి ఉంది. పుష్ప సినిమా తర్వాత వీలైనంత త్వరగా కథ ఓకే చేయించి మరో న్యూ ప్రాజెక్ట్ ను కూడా రామ్ చరణ్ వెంటనే స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. చూడాలి మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.