Begin typing your search above and press return to search.

ఖాన్‌ల‌తో క‌లిసి చ‌ర‌ణ్ ఏం చేసాడో చూసారా?

ఇప్పుడు నాటు నాటు దరువులకు నృత్యం చేయడానికి బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్‌లతో కలిసి వేదికపైకి వచ్చిన రామ్ చ‌ర‌ణ్ ఫోటోలు వీడియోలు వైర‌ల్ గా మారుతున్నాయి

By:  Tupaki Desk   |   3 March 2024 10:36 AM GMT
ఖాన్‌ల‌తో క‌లిసి చ‌ర‌ణ్ ఏం చేసాడో చూసారా?
X

గుజ‌రాత్ జామ్ న‌గ‌ర్‌లో అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక‌లు చాలా మ్యాజిక్ ని క్రియేట్ చేస్తున్నాయి. అక్క‌డ వేదిక వ‌ద్ద చాలా మ్యాజిక‌ల్ మూవ్ మెంట్స్ ని స్టార్ల అభిమానులు వీక్షిస్తున్నారు. ఇంత‌కుముందే ఖాన్ ల త్ర‌యంలో స‌ల్మాన్- షారూఖ్‌- అమీర్ క‌లిసి ఆర్.ఆర్.ఆర్ నాటు నాటుకు స్టెప్పులేస్తున్న వీడియో, ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఒక సౌత్ సినిమా పాట‌కు వీరంతా అంబానీల పెళ్లిలో ప్రాధాన్య‌త‌నివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్పుడు నాటు నాటు దరువులకు నృత్యం చేయడానికి బాలీవుడ్ దిగ్గజాలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్‌లతో కలిసి వేదికపైకి వచ్చిన రామ్ చ‌ర‌ణ్ ఫోటోలు వీడియోలు వైర‌ల్ గా మారుతున్నాయి. వారంతా కలిసి నాటు నాటు హుక్ స్టెప్‌ను అద‌ర‌గొట్టారు.

అహూతుల్లో జోష్ ని నింపారు. నాటు నాటుకు ఒరిజిన‌ల్ మ్యూజిక్ కేట‌గిరీలో (విదేశీ సినిమాగా) ఆస్కార్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా వేదిక‌ల‌పై నాటు నాటుకు ప్ర‌ముఖులు నృత్యం చేసారు. వీట‌న్నిటిలో అంబానీ పెళ్లిలో ఖాన్ ల‌ నృత్యం ప్ర‌త్యేకంగా నిలిచింది.

ఖాన్ లు వారు న‌టించిన సినిమాల నుంచి పాట‌ల‌కు కూడా నృత్యం చేసారు. ఇక చ‌ర‌ణ్ ఇంత‌కుముందు ఎం.ఎస్.ధోనీతో క‌లిసి దాండియా ఆడిన సంగ‌తి తెలిసిందే. అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ మూడు రోజుల వివాహానికి ముందు జరిగిన వేడుకలలో సంగీత్ చాలా ప్ర‌త్యేకంగా నిలిచింది. మొద‌టి రోజు ఈవెంట్లో రిహాన్నా డ్యాన్సుల కోలాహాలం వేడెక్కించింది.