Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ సినిమాలు.. డౌట్స్ అన్ని తీరేది ఆ రోజే..

అయితే ఈ రెండు సినిమాల అప్డేట్స్ కోసం రామ్ చరణ్ అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ త్వరలోనే పడనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 3:15 AM GMT
రామ్ చరణ్ సినిమాలు.. డౌట్స్ అన్ని తీరేది ఆ రోజే..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలోగా నటించిన మూవీ రిలీజ్ అయ్యి.. ఐదేళ్లు అయిపోతుంది. 2019 సంక్రాంతికి వినయ విధేయ రామ మూవీతో వచ్చిన చరణ్.. సరైన ఫలితం దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2022లో విడుదలైన ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా తన నటనతో అదరగొట్టేశారు రామ్ చరణ్.

ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ దక్కించుకున్న చరణ్.. గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ.. ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తారోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్న సమయంలో కొత్త మూవీని ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ తీస్తున్నట్లు తెలిపారు. కానీ ఈ మూవీ షూటింగ్ మొదలై రెండేళ్లు దాటిపోయినా... ఇంకా పూర్తి కాలేదు. కనీసం అప్డేట్స్ కూడా లేవు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా.. సెట్స్ పై ఉండగానే చరణ్ మరో మూవీ ప్రకటించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర క్రీడా నేపథ్యంలో RC 16 మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో మేకర్స్ ఆడిషన్స్ కూడా నిర్వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్. కానీ మేకర్స్ ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు.

అయితే ఈ రెండు సినిమాల అప్డేట్స్ కోసం రామ్ చరణ్ అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ త్వరలోనే పడనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మార్చి 27వ తేదీన చరణ్ పుట్టినరోజు సందర్భంగా, రెండు ప్రాజెక్టుల అప్డేట్స్ రానున్నాయట. గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ను ఆ రోజే ప్రకటించనున్నారట. RC 16 ప్రాజెక్ట్ కు సంబంధించి ఫస్ట్ అప్డేట్ రానుందట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ కీలక షెడ్యూల్ షూటింగ్.. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. మరి ఈ సినిమా అక్టోబరు లేదా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు RC 16 టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.