Begin typing your search above and press return to search.

గురు శిష్యులతో చరణ్ సేఫ్ గేమ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసి. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది

By:  Tupaki Desk   |   23 March 2024 4:16 AM GMT
గురు శిష్యులతో చరణ్ సేఫ్ గేమ్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసి. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ ఆఖరు నుంచి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోయే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం RC 17 స్టార్ట్ కానుంది. ఇప్పటికే స్టొరీ ఫైనల్ అయిపోయి ఉందంట. అంటే రామ్ చరణ్ గురు శిష్యులతో వెంటవెంటనే సినిమాలు చేయబోతున్నారని అర్ధమవుతోంది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా అదిరిపోయే పీరియాడికల్ జోనర్ కథని రామ్ చరణ్ కోసం సిద్ధం చేసి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం సుకుమార్ పుష్ప ది రూల్ కంప్లీట్ చేయడంపైన ఫోకస్ చేశారు. ఈ మూవీ ఆగష్టులో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత రామ్ చరణ్ కథపై సుకుమార్ వర్క్ చేస్తాడని తెలుస్తోంది. అలాగే చరణ్ బర్త్ డే రోజున ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. గతంలో రామ్ చరణ్ కి రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సుకుమార్ ఇచ్చాడు.

రామ్ చరణ్ లో ఉండే బెస్ట్ యాక్టర్ ని ఈ చిత్రంలో సుకుమార్ అద్భుతంగా ప్రెజెంట్ చేసి అతని మీద ఉన్న విమర్శలు తుడిచేసాడు. చరణ్ కెరియర్ కూడా రంగస్థలంకి ముందు రంగస్థలం తర్వాతగా లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం చరణ్ స్టోరీస్ ఎంపిక పూర్తిగా మారిపోయింది. అదంతా రంగస్థలం ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బుచ్చిబాబు అలాంటి పీరియాడిక్ జోనర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో చరణ్ తో సినిమా చేస్తున్నాడు.

గురు శిష్యులు పోటీ పడి మరీ చరణ్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితోనే ఉన్నారు. ఇద్దరి సినిమాల్లో మినిమమ్ కంటెంట్ ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి చరణ్ కు ఇది సేఫ్ గేమ్. అయితే ఇద్దరిలో ఎవరి సినిమా సూపర్ హిట్ అవుతుంది. గురు శిష్యుల్లో ఎవరు బలమైన సినిమాని చరణ్ కి ఇస్తారనేది చూడాలి. బుచ్చిబాబు కూడా సుకుమార్ తరహాలోనే సినిమాలని ఎమోషనల్ ఎలిమెంట్స్ బేస్ చేసుకొని తెరకెక్కిస్తాడని ఉప్పెన మూవీతో స్పష్టం అయ్యింది. ఇప్పుడు చరణ్ సినిమా కోసం ఎలాంటి ఎమోషనల్ థీమ్స్ ని డిజైన్ చేసుకున్నాడు అనేది చూడాలి.