Begin typing your search above and press return to search.

బుచ్చి బాబుతో చరణ్.. దానికి కొనసాగింపా..?

మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకునే దర్శకులు చాలా అరుదు. ఈ లిస్ట్ లో చేరిపోయాడు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చి బాబు

By:  Tupaki Desk   |   25 Dec 2023 2:30 PM GMT
బుచ్చి బాబుతో చరణ్.. దానికి కొనసాగింపా..?
X

మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకునే దర్శకులు చాలా అరుదు. ఈ లిస్ట్ లో చేరిపోయాడు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చి బాబు. ఉప్పెనతో అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కొత్త హీరో కొత్త హీరోయిన్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభ చాటాడు బుచ్చి బాబు. ఈ సినిమా తర్వాత సెకండ్ మూవీ ఛాన్స్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అసలైతే ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా ప్లాన్ చేయగా అది ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు.

చరణ్ తో బుచ్చి బాబు చేస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. ఈమధ్య కాలంలో తెలుగు తెర మీద పీరియాడికల్ సినిమాల హంగామా నడుస్తుంది. ఆల్రెడీ చరణ్ రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం రికార్డులు సృష్టించింది.

బుచ్చి బాబు చేసే సినిమా కూడా దాదాపు రంగస్థలం కి దగ్గరగా ఉంటుందని కొందరు అంటుంటే. దానికి కొనసాగింపే అని కొందరు చెప్పుకుంటున్నారు. అయితే బుచ్చి బాబు సినిమా కథ ఏంటి పీరియాడికల్ గా చెబుతున్నా ఈసారి బుచ్చి బాబు ఎలాంటి కథతో వస్తారన్నది తెలియాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ తను చేసే ప్రతి సినిమా వరల్డ్ సినీ లవర్స్ ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాడు.

ప్రస్తుతం శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న చరణ్. ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. ఆర్సీ 16వ సినిమా తప్పకుండా రంగస్థలం, RRR సినిమాలకు ధీటుగా ఉంటుందని చెప్పొచ్చు. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తోనే మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. గ్లోబల్ వైడ్ గా తమకు వచ్చిన ఇమేజ్ కు తగినట్టుగానే చరణ్ తన సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ శంకర్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుండగా బుచ్చి బాబు సినిమా మరోసారి చరణ్ లో నట విశ్వరూపం చూపిస్తుందని టాక్.