Begin typing your search above and press return to search.

వీడియో: రామ్ చ‌ర‌ణ్ బోరింగ్ ఇంట‌ర్వ్యూ

ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ కి ఉన్న ఆన్ లైన్ షాపింగ్ ఆస‌క్తి గురించి త‌న్మ‌య్ ఎక్కువ‌గా ప్ర‌శ్నించారు.

By:  Tupaki Desk   |   25 July 2023 5:32 PM GMT
వీడియో: రామ్ చ‌ర‌ణ్ బోరింగ్ ఇంట‌ర్వ్యూ
X

RRR స్టార్ రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్' చిత్రం లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బుచ్చిబాబు స‌న‌తో క్రీడా నేప‌థ్య‌ సినిమా కి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే జెర్సీ దర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి.. సుకుమార్ ల‌తోను సినిమాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ఏం చేస్తున్నారు? అంటే.. త‌న తీరిక స‌మ‌యాల్లో మీడియాల‌ తోను ఇంట‌రాక్ట్ అవుతున్నారు. చ‌ర‌ణ్ ఆస్కార్ వేడుకల్లో భాగంగా అప్ప‌ట్లో హాలీవుడ్ మీడియాతో ఇంట‌రాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అంత‌గా ఇంట‌ర్వ్యూలేవీ లేవు. ఇప్పుడు పాపుల‌ర్ ఫ్యాష‌న్ మ‌ర్కండైల్ వెబ్ సైట్ మీషో హోస్ట్ త‌న్మ‌య్ భ‌ట్ తో ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ ఫ్యాష‌న్ అండ్ సెన్స్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ ను ముచ్చ‌టించారు.

ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ కి ఉన్న ఆన్ లైన్ షాపింగ్ ఆస‌క్తి గురించి త‌న్మ‌య్ ఎక్కువ‌గా ప్ర‌శ్నించారు. ఇటీవ‌లి కాలం లో చ‌ర‌ణ్ ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న ఆన్ లైన్ వ‌స్తువు ఏది? అంటే.. చ‌ర‌ణ్ దానికి ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు. ''నేను ఆన్ లైన్ లో బెస్ట్ వాచ్ కొన్నాను. క్యాషియో బ్రాండ్ వాచ్ అది. ప్యాకింగ్ అందుకోగానే ఎగ్జ‌యిట్ అయ్యా.. అది మిల‌ట‌రీ క‌ల‌ర్ వాచ్.. అందుకోగానే ఎంతో మురిసిపోయాను'' అని తెలిపాడు.

ఆన్ లైన్ షాపింగ్ ని ఇష్ట‌ప‌డ‌తారా? అన్న ప్ర‌శ్న‌కు... షూటింగులు లేని స‌మ‌యం లో ఆన్ లైన్ లోనే ఉంటాను.. ఏదో ఒక‌టి కొంటుంటాను.. అని తెలిపారు. ఆన్ లైన్ లో ధ‌ర‌ల ప‌రంగా ఎలాంటి ఆప్ష‌న్ ఎంపిక చేసుకుంటారు? అన్న ప్ర‌శ్న‌కు.. రేటు 'లో టు హై' త‌ప్ప‌నిస‌రిగా చూస్తాను కానీ చివ‌రికి హై లోనే కొంటాను! అని తెలిపారు. త‌న‌కు బాగా ఇష్ట‌మైనవి ష‌ర్ట్స్.. క్రంపుల్ ష‌ర్ట్ .. చెక్స్ ష‌ర్ట్ లాంటివి కొనేందుకు ఇష్ట‌ప‌డ‌తాను. కానీ నాకు ఇంట్లో ఆరుగురు సోద‌రీమ‌ణులు ఉన్నారు. వారంతా ఫ్యాష‌న్ పోలీసులు. నా ఫ్యాష‌న్ సెన్స్ కి బెస్ట్ క్రిటిక్స్.. వారి నుంచి కాంప్లిమెంట్లు రావ‌డం చాలా క‌ష్టం.. అని చ‌ర‌ణ్ తెలిపాడు.

వైఫ్ నుంచి ఫ్యాష‌న్ ఎంపిక‌ల ప‌రంగా సూచ‌న‌ల గురించి కూడా చ‌ర‌ణ్ వెల్ల‌డించాడు. ''నాకు పెళ్ల‌యిన స‌మ‌యం లో గ్రే - వైట్ అండ్ బ్లాక్ క‌ల‌ర్ దుస్తులు మాత్ర‌మే చాలా కామ‌న్ గా తొడిగేవాడిని అని తెలిపాడు. ఆ డ్రెస్ లు చూశాక‌.. ఇవ‌న్నీ వేస్ట్ ... క‌ల‌ర్ ఫుల్ డ్రెస్సులు తొడ‌గాలి అని ఉపాస‌న త‌న స్టైల్ మార్చేసింద‌ని చ‌ర‌ణ్ తెలిపాడు.

ఆన్ లైన్ లో చెత్త షాపింగ్ ఏది? అని ప్ర‌శ్నించ‌గా.. ఇటీవ‌లే నేను ఒక జాకెట్ కొన్నాను. అది ఏ దేశం నుంచి వ‌చ్చిందో కూడా ప్యాకింగ్ పై మెన్ష‌న్ చేయ‌లేదు. నేను ఆన్ లైన్ లో కొన్న చెత్త వ‌స్తువు ఇది. ఇలాంటివి నాణ్య‌త లేకుండా ఎలా అమ్ముతారో తెలీదు.. అని చ‌ర‌ణ్ త‌న అనుభ‌వాన్ని వెల్ల‌డించారు. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ సినిమాల గురించి ఎలాంటి ప్ర‌శ్న‌లు లేవు. ఇటీవ‌లే ఆస్కార్ అందుకున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ గురించి మాత్ర‌మే మీషో త‌న్మయ్ చ‌ర‌ణ్ ని ప్ర‌శ్నించారు. ఇక ర్యాపిడ్ ఫైర్ క్వ‌శ్చ‌న్స్ పేరుతో ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీకి చెందిన కొన్ని కోడ్ వ‌ర్డ్స్ గురించి ప్ర‌శ్నిస్తూ ఇంట‌ర్వ్యూని చివ‌రికి బాగా బోర్ కొట్టించారు.