Begin typing your search above and press return to search.

అంద‌రూ దోశ మాస్ట‌ర్ లేనా..ట్రైనింగ్ అత్త‌మ్మ‌నా!

చరణ్ దోశలు వేస్తున్న ఓ వీడియోను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ దోశలు వేస్తూ కనిపించారు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 9:31 AM GMT
అంద‌రూ దోశ మాస్ట‌ర్ లేనా..ట్రైనింగ్ అత్త‌మ్మ‌నా!
X

మెగా ఫ్యామిలీ ఇంట అంతా దోశ‌లు వేసే మాష్ట‌ర్లే ఉన్నారా? అంటే అవున‌నే అనాలి ఏమో! మాస్ట‌ర్ల‌కే మాస్ట‌ర్ మెగాస్టార్. చిరంజీవి దోశలు వేసిన వీడియో అప్ప‌ట్లో ఎలా వైర‌ల్ అయిందో తెలిసిందే. అప్పుడాయ‌న అందులో ర‌క‌ర‌కాల దోశెలేసి కుటుంబ స‌భ్యులంద‌రికీ తినిపించారు. ఎగ్ దోశ...ర‌వ్వ దోశ ఇలా ఎవ‌రి ఇష్టం మేర‌కు వారికి దోస‌లు స‌ర్వ్ చేసారు. ఖాళీ స‌మ‌యంలో ఇదో టైంపాస్ గా కిచెన్ రూమ్ లో చిరు చేసిన ప్ర‌య‌త్నం అది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ కూడా దోశలు స‌ర్వ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.


చరణ్ దోశలు వేస్తున్న ఓ వీడియోను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ దోశలు వేస్తూ కనిపించారు. ఈ దోశ‌కు ఓ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఉపాసన. రామ్ చరణ్ దోశలు వేసే ట్రైనింగ్ తన అత్త సురేఖ ఇచ్చార‌ని రాసుకొచ‌చారు. ఇదే వీడియోలో సురేఖ కూడా దోశలు వేస్తూ కనిపించారు. వీడియో ఆ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ప్ర‌స్తుతం మెగా-అల్లు ఫ్యామిలీలు క‌లిసి సంక్రాంతి వేడుక‌ను బెంగుళూరులో సెల‌బ్రేట్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

అక్క‌డ స‌ర‌దాలు..అచ్చ‌ట్లు..ముచ్చ‌ట్లు అన్నింటిని ఉపాస‌న త‌న ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసారు. ఈ వీడియో కూడా అక్క‌డి నుంచే రిలీజ్ అయింది. చ‌ర‌ణ్ అంద‌రికీ ఎవ‌రికి కావాల్సిన విధంగా వారికి దోశ‌లు వేసి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇలా తండ్రికొడుకులిద్ద‌రు దోశ‌లు వేయ‌డం చ‌ర్చ‌కొస్తుందండోయ్. ఇంట్లో అంతా దోశ అభిమానులు ఎక్కువ‌గా ఉన్న‌ట్లున్నారు. అందుకే ఇలా ఇప్పుడు చ‌ర‌ణ్ గ‌రిట ప‌ట్టి దోశ‌లు వేసిన‌ట్లున్నారంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

వాళ్లిద్ద‌రికీ సురేఖ దోశ‌లు నేర్పించారు. మ‌రి ఇంత‌కీ కోడ‌ల‌కి దోశ‌లు వేయ‌డం వ‌చ్చా? లేక ఉపాస‌న కూడా అత్త‌మ్మ ట్రైనింగ్ నా? అంటూ మ‌రికొంత మంది పోస్టులు పెట్టారు. తండ్రిబాట‌లోనే త‌న‌యుడు అంటూ ఇంకొంత మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఉపాస‌న చేప‌ల పులుసు చేయ‌డంలో స్పెష‌లిస్ట్. చ‌ర‌ణ్ కి ఇష్ట‌మైన చేప‌ల పులుసు ఎంతో ఇష్టంగా ప్రిపేర్ చేస్తుంటారు.