Begin typing your search above and press return to search.

లియోలో మెగా హీరో.. ఇదిగో ప్రూఫ్​

దసరాకు రిలీజ్ కాబోతున్న లియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యామియో ఉంటుందనే ప్రచారం మరోసారి ఒక్కసారిగా ఊపందుకుంది

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:29 AM GMT
లియోలో మెగా హీరో.. ఇదిగో ప్రూఫ్​
X

దసరాకు రిలీజ్ కాబోతున్న లియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యామియో ఉంటుందనే ప్రచారం మరోసారి ఒక్కసారిగా ఊపందుకుంది. సోషల్ మీడియాలో అభిమానులంతా ఈ వార్తను తెగ షేర్ చేస్తూ తమ సంతోషాన్ని రకరకాల రూపాల్లో వ్యక్తం చేసుకుంటున్నారు. చరణ్ కనిపించేది కాసేపే అయినా హై లెవెల్ హీరోయిజంతో అదరగొడతాడనే రేంజ్​లో తెగ ఊహించేసుకుంటున్నారు.

వీటన్నింటికీ కారణం.. యూఎస్​కు చెందిన ఓ టికెట్ బుకింగ్ వెబ్​సైట్​. ఈ వెబ్​సైట్​లో లియోకు చెందిన కాస్ట్​ వివరాల్లో సంజయ్ దత్, అనురాగ్ కశ్యప్​, గౌతమ్ మేనన్, త్రిష, మస్కిన్​, అర్జున సర్జా, మ్యాథూ థామస్​తో పాటు రామ్​ చరణ్​ పేరును జోడించడం. సదరు వెబ్​సైట్​ పాత సమాచారం పెట్టి ఉండొచ్చు లేదా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఒకవేళ చరణ్ కనిపించడం నిజమే అయితే అటు విజయ్ స్టార్స్​కు ఇటు చరణ్​ ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.

అలాగే లోకేశ్​ కనగరాజ్​తో చరణ్​ ఓ సినిమా చేస్తారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లియోలో కనుక ఆయన కనపడితే.. భవిష్యత్​లో లోకేశ్ యూనివర్స్​లో చరణ్ భాగమవుతారు అని చెప్పడానికి హింట్ ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంతో పాటు తమిళ మీడియాకు వరసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు లోకేష్ కనగరాజ్.

అయితే ఈ ప్రమోషన్స్​లో లోకేశ్.. హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ అఫ్ వైలెన్స్​కు లీయో ఫ్రీమేక్​ అంటూ వస్తున్న వార్తలకు నేరుగా సమాధానం చెప్పలేదు. నిర్మాతలు అధికారికంగా ఆ సినిమా హక్కులు కొనేసి ఆ విషయం బయట పడకుండా జాగ్రత్త పడ్డారని చెన్నై టాక్​. అక్టోబర్ 19న ఈ విషయంపై క్లారిటీ రానుంది.

ఇకపోతే సినిమాలో విజయ్​.. రెండు షేడ్స్​లో నటించారు. రెండు వందల కోట్ల బడ్జెట్​తో సినిమా తీశారని మరో ప్రచారం జరుగుతోంది. రీసెంట్​గా రిలీజైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాకపోతే కాస్త మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. అయినా సినిమాపై హైప్ బాగానే ఉంది.