Begin typing your search above and press return to search.

చరణ్ గేమ్ చేంజర్ లో కమల్ హాసన్..?

ఆచార్య తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రాం చరణ్

By:  Tupaki Desk   |   20 April 2024 12:30 PM GMT
చరణ్ గేమ్ చేంజర్ లో కమల్ హాసన్..?
X

ఆచార్య తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రాం చరణ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే నేషనల్ లెవెల్ లో భారీ హైప్ వచ్చినట్టే. గేమ్ చేంజర్ తో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయిన శంకర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గేమ్ చేంజర్ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారట శంకర్.

ముఖ్యంగా గ్లోబల్ స్టార్ చరణ్ ఇమేజ్ కు తగినట్టుగా సినిమా ఏమాత్రం టార్గెట్ మిస్ అవ్వకూడదని గేమ్ చేంజర్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఒక సర్ ప్రైజ్ క్యామియో చేస్తున్నాడని లేటెస్ట్ టాక్. అదేంటి అదెలా సాధ్యం అనుకోవచ్చు. శంకర్ ఒకేసారి కమల్ హాసన్ తో భారతీయుడు 3, చరణ్ తో గేమ్ చేంజర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

భారతీయుడు సినిమాకు సీక్వల్ గా దాదాపు పాతికేళ్ల తర్వాత భారతీయుడు 2 వస్తుంది. ఇక ఇదే టైం లో సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ సినిమాను కూడా శంకర్ అంచనాలకు తగినట్టుగానే రూపొందిస్తున్నారు. అయితే నేషనల్ వైడ్ గా గేమ్ చేంజర్ మీద ఉన్న హైప్ మరింత పెంచేందుకు సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ క్యామియో ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కమల్ గెస్ట్ రోల్ సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

ఇప్పటికే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ చేస్తున్న కల్కి సినిమాలో కమల్ హాసన్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. కమల్ నటించడంతో కల్కి మీద భారీ హైప్ వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా కమల్ ఉన్నాడని మెగా ఫ్యాన్స్ అంచనాలు డబుల్ అయ్యాయి. మరి గేమ్ చేంజర్ లో కమల్ నిజంగా ఉన్నాడా ఇదంతా జస్ట్ రూమరేనా అన్నది త్వరలో తెలుస్తుంది.

ఆచార్య అంచనాలను అందుకోకపోగా RRR తర్వాత చరణ్ స్టామినా చూపించేందుకు గేమ్ చేంజర్ రెడీ అవుతుంది. దీపావళి రేసులో దిగుతున్న ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.