Begin typing your search above and press return to search.

అది పూర్తైతే కానీ చరణ్ టాప్ గేర్ వేయలేడా..?

అంతేకాదు మరోపక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా చరణ్ డిఫరెంట్ గెటప్ తో కనిపించనున్నాడు. అందుకే గేమ్ చేంజర్ పూర్తి చేశాకే నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 1:30 AM GMT
అది పూర్తైతే కానీ చరణ్ టాప్ గేర్ వేయలేడా..?
X

RRR, ఆచార్య రెండు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయ్యేలా చూసిన చరణ్ లాస్ట్ ఇయర్ మొత్తం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ కే కేటాయించాడు. అసలైతే సినిమా అనుకున్న విధంగా షూటింగ్ చేసుంటే ఈపాటికి రిలీజ్ అయ్యి ఉండాలి. కనీసం సమ్మర్ రిలీజ్ అయినా షెడ్యూల్ చేసి ఉండాలి. డైరెక్టర్ శంకర్ ఓ పక్క కమల్ హాసన్ తో ఇండియన్ 2 చేస్తూనే మరోపక్క గేమ్ చేంజర్ ని చేస్తున్నాడు. రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీద ఉండేసరికి ఒక షెడ్యూల్ అక్కడ మరో షెడ్యూల్ ఇక్కడ అన్నట్టు ఉంది.

గేమ్ చేంజర్ సినిమా కోసం చరణ్ మేకోవర్ కనిపిస్తుంది. సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగిగా చరణ్ కనిపించనున్నాడు. అంతేకాదు మరోపక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా చరణ్ డిఫరెంట్ గెటప్ తో కనిపించనున్నాడు. అందుకే గేమ్ చేంజర్ పూర్తి చేశాకే నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

చరణ్ గేం చేంజర్ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే చరణ్ గేమ్ చేంజర్ పూర్తి చేయాలి. గేమ్ చేంజర్ ఒక్క సినిమా వల్ల చరణ్ దూకుడుకి బ్రేక్ వేసినట్టు అయ్యింది. ఆ సినిమాను శంకర్ చాలా జాగ్రత్తగా చెక్కుతున్నాడు.

గేమ్ చేంజర్ చరణ్ సినిమాగా తన మార్క్ చూపించడం కన్నా శంకర్ స్టైల్ లో తీస్తున్నాడని తెలుస్తుంది. ఆ సినిమా పూర్తైతే కానీ చరణ్ వేరే సినిమాకు డేట్స్ ఇవ్వడం కుదరదు. గేమ్ చేంజర్ ని పూర్తి చేసి త్వరగా బుచ్చి బాబు సినిమాకు పనిచేయాలని అనుకుంటున్నాడు చరణ్. ఉప్పెనతో తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు చరణ్ తో మెగా స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.

శంకర్ గేమ్ చేంజర్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో RC16 ప్రాజెక్ట్ గా రాబోతున్న సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నారని టాక్.