Begin typing your search above and press return to search.

ఆ పండగను టార్గెట్ చేసిన రామ్ చరణ్

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:57 AM GMT
ఆ పండగను టార్గెట్ చేసిన రామ్ చరణ్
X

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియరా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ షెడ్యుల్ కోసం మైసూర్ వెళ్తున్నారు. భారతీయుడు 2 షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

దీంతో శంకర్ ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ పై ఇప్పటికి ఎలాంటి క్లారిటీ లేదు. శంకర్ సినిమాని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది నిర్మాత దిల్ రాజుకి తెలియడం లేదు. అందుకే సినిమా రిలీజ్ డేట్ విషయంలో మీడియా అడిగిన డైరెక్టర్ కంప్లీట్ చేసి ఇచ్చినదాని బట్టి రిలీజ్ ఉంటుందని గతంలో చెప్పారు.

భారతీయుడు 2 మూవీ రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. భారతీయుడు 2 టీజర్ రీసెంట్ గా వచ్చింది. మొదటి సినిమా తరహాలోనే అవినీతి, లంచం అనే సోషల్ ఎలిమెంట్స్ ని తీసుకొని శంకర్ సీక్వెల్ చేశారు. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లోనే భారతీయుడు మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

తరువాత దీపావళికి గేమ్ చేంజర్ రిలీజ్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నారంట. పాన్ ఇండియా బ్రాండ్ తో రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో నార్త్ ఇండియన్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారంట. ఆ టైం లో అయితే మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. అయితే దిల్ రాజు నుంచి మాత్రం రిలీజ్ డేట్ విషయంలో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు క్లారిటీ రాకపోవచ్చు.

తరువాత కరెక్ట్ టైం చూసుకొని దిల్ రాజు రిలీజ్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అతనికి కరెక్ట్ అంచనా ఉంటుంది. శంకర్ ప్లానింగ్ ఎలా ఉన్న గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో ఫైనల్ డెసిషన్ దిల్ రాజుది అయ్యే ఛాన్స్ ఉంది.