Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రి అభిమానుల‌కు పండ‌గ‌లాంటి క్ష‌ణ‌మిది!

అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న దంప‌తులు మెరిసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 March 2024 6:52 AM GMT
ఆ ఇద్ద‌రి అభిమానుల‌కు పండ‌గ‌లాంటి క్ష‌ణ‌మిది!
X

అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న దంప‌తులు మెరిసిన సంగ‌తి తెలిసిందే. ఓ గ్లోబ‌ల్ స్టార్ గా చ‌ర‌ణ్‌.. బిజినెమెస్ ఉమెన్ గా ఖ్యాతికెక్కిన ఉపాస‌న అంబానీ ఇంట వేడుక‌లో భాగం కావ‌డంతో అభిమానులెంతో సంతోషిస్తున్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి కేవ‌లం చ‌ర‌ణ్‌..తార‌క్ మాత్ర మే హాజ‌ర‌వ్వ‌డం విశేషం. ఇక మూడు రోజుల వేడుక‌లో భాగంగా చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు ఎంతో సంతో షంగా పాల్గొన్నారు.

అన్ని ర‌కాల ఈవెంట్ల‌లోనూ భాగ‌మయ్యారు. వ‌చ్చిన అతిధులంద‌రితో..త‌మ‌కు తెలిసిన వారంద‌రితో స‌ర‌ద‌గా ముచ్చ‌టించ‌డం జ‌రిగింది. దీనిలో భాగంగానే చ‌ర‌ణ్ దంప‌తులు..మాజీ క్రికెట‌ర్ ..మిస్ట‌ర్ కూల్ ధోనీ దంప‌తులు ఒకే ప్రేమ్ లో భాగ‌మైన‌ట్లు తెలుస్తోంది. న‌లుగురు ఒకేచోట చేరి ఫోటో షేర్ చేసుకున్నారు. ఇప్పుడీ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇది ఎంతో అరుదైన కాంబినేష‌న్..దృశ్యం అంటూ అభిమానులు ఆ ఫోటోని త‌నివి తీరా చూస్తున్నారు.

ధోనీ-చ‌ర‌ణ్ ఒకే చోట క‌ల‌వ‌డ అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. తొలిసారి ఏకంగా రెండు కుటుంబాలు క‌ల‌వ‌డం ఇదే తొలిసారి. ఫోటో సెష‌న్ లో భాగంగా ధోనీ..సాక్షి- ఉపాస‌న‌..చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా ఈ ఫోటో షేర్ చేసుకున్నారు. అంద‌రూ స్టైలిష్ దుస్తుల్లో మెరిసిపోయారు. బ్యాక్ గ్రౌండ్ లో మిరుమిట్లు గొలిపే రంగుల కాంతులు.. డిజైన్స్ తో కూడిన వ‌ర్ణాలు ఎంతో అందంగా హైలైట్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ధోనీ..చ‌ర‌ణ్ అభిమానులు చూసి చూడ ముచ్చ‌టైన జంట లు...చూడాల్సిన జోడీలు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక ధోనీ రిటైర్మెంట్ త‌ర్వాత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌రి మిస్ట‌ర్ కూల్ గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందిగా.