Begin typing your search above and press return to search.

అర్హ, క్లీంకార క్యూట్‌ వైరల్ వీడియో

టాలీవుడ్‌ స్టార్స్ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్‌ ల వీడియోలు ఫోటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:25 AM GMT
అర్హ, క్లీంకార క్యూట్‌ వైరల్ వీడియో
X

టాలీవుడ్‌ స్టార్స్ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్‌ ల వీడియోలు ఫోటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. వారి భార్యలు ఉపాసన మరియు స్నేహాల యొక్క ఫోటోలు వీడియోలు కూడా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి అర్హ, క్లీంకార వీడియో వైరల్‌ అయ్యింది.

ఈ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరింది. పవన్ కళ్యాణ్ తప్ప మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలను మరియు వీడియోలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉన్నారు.

ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో చరణ్‌ కూతురు క్లీంకార, అల్లు అర్జున్ కూతురు అర్హల వీడియో వైరల్‌ అయ్యింది. క్లీంకార ను ఉపాసన ఎత్తుకొని ఉండగా, క్లీంకార తో అర్హ ఆడుకుంటూ ఉన్న ఈ వీడియోకు అభిమానులు శ్రీవల్లి పాట ను యాడ్‌ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయడం తో వైరల్‌ అయ్యింది.

సోషల్‌ మీడియాలో ఈ క్యూట్‌ వీడియోను చాలా మంది తెగ లైక్ చేస్తున్నారు. రాబో తరం మెగా ఫ్యామిలీ ప్రిన్సెస్‌ అంటూ ఈ ఇద్దరిని గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు తండ్రులు చాలా క్లోజ్. ఇప్పుడు వీరు కూడా మంచి స్నేహితులు అవ్వబోతున్నారేమో చూడాలి.