Begin typing your search above and press return to search.

స్టార్ హీరో చిన్నప్పటి పోటో.. ఎవరో గుర్తుపట్టారా?

తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటో కావడం విశేషం.

By:  Tupaki Desk   |   11 March 2024 3:49 AM GMT
స్టార్ హీరో చిన్నప్పటి పోటో.. ఎవరో గుర్తుపట్టారా?
X

స్టార్ హీరోల చిన్నప్పటి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అభిమానులు అయితే తన హీరో చిన్నప్పటి ఫోటోలు అంటే తెగ షేర్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఈ జెనరేషన్ లో ఉన్న స్టార్స్ చూసుకుంటే చాలా తక్కువ మంది చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

వాటిలో మెగా ఫ్యామిలీ హీరోల ఫొటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతాయి. ఎక్కడ దొరుకుతాయో, ఎలా దొరుకుతాయో తెలియదు కానీ ఫ్యాన్స్ ఆ ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులకి ఎవరో పోల్చుకోమని టాస్క్ లు ఇస్తూ ఉంటారు. తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటో కావడం విశేషం.

రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయంలో ఒక మెగాస్టార్ కొడుకు అని తప్ప హీరో కావడానికి ఎలాంటి అర్హత లేదని చాలా మంది విమర్శలు చేశారు. అదే రామ్ చరణ్ రెండో సినిమా మగధీరతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. రంగస్థలం సినిమాతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి గెటప్ లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నార్త్ ఇండియన్స్ అయితే ఏకంగా రాముడిని అతనిలో చూసుకున్నారు. అంతలా చరణ్ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అతను చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నాడని వైరల్ అవుతోన్న ఫోటో చూస్తుంటే తెలుస్తోంది.

చాలా మంది చైల్డ్ యాక్టర్స్ కంటే బెస్ట్ లుక్స్ తో రామ్ చరణ్ చిన్న వయస్సులో ఉన్నాడని అభిమానులు ఆ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన వారిలో కొంతమంది వెంటనే రామ్ చరణ్ అని పోల్చేయగా మరికొంత మంది మాత్రం చైల్డ్ యాక్టర్ అంటూ ట్వీట్ లు చేయడం విశేషం. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.