Begin typing your search above and press return to search.

లేడీ ప్రెండ్స్ గ్యాంగ్ తో చ‌ర‌ణ్ ఇలా

ఎన్న‌డు లేనంత‌గా 2023 లో టాలీవుడ్ సెల‌బ్రిటీ ఫ్యామిలీ ఇంట దివాలీ ద‌ద్ద‌రిల్లింది. స్టార్లు అంతా క‌లిసి ఒకే చోట దీపావ‌ళి సెల‌బ్రేట్ చేసుకోవ‌డం విశేషం.

By:  Tupaki Desk   |   14 Nov 2023 5:52 AM GMT
లేడీ ప్రెండ్స్ గ్యాంగ్ తో చ‌ర‌ణ్ ఇలా
X

ఎన్న‌డు లేనంత‌గా 2023 లో టాలీవుడ్ సెల‌బ్రిటీ ఫ్యామిలీ ఇంట దివాలీ ద‌ద్ద‌రిల్లింది. స్టార్లు అంతా క‌లిసి ఒకే చోట దీపావ‌ళి సెల‌బ్రేట్ చేసుకోవ‌డం విశేషం. సాధార‌ణంగా ఈర‌క‌మైన క‌ల్చ‌ర్ బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో క‌నిపిస్తుంది. రెండు ..మూడేళ్ల‌గా టాలీవుడ్ లోనే ఆవిధ‌మైన సంస్కృతి పెరుగుతుంది. తాజాగా ఈ ఏడాది ఆ ఉత్సాహం మ‌రింత రెట్టింపు అయిన‌ట్లుంది. ఇప్ప‌టికే మ‌హేష్‌...చ‌ర‌ణ్‌...తార‌క్ ఫ్యామిలీస్ అంతా గెట్ టూ గేద‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఒకేరోజు స్టార్లు అంతా వివిధ సెల‌బ్రిటీ ఈవెంట్ల‌లో క‌నిపించారు.


తాజాగా చ‌ర‌ణ్‌..మంచు ల‌క్ష్మి అండ్ గ్యాంగ్ సెల‌బ్రేట్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. లేడీ ప్రెండ్స్ గ్యాంగ్ లో చ‌ర‌ణ్ మ‌ధ్య‌లో క‌నిపిస్తున్నాడు. అందులో మంచుల‌క్ష్మి ఉన్నారు. దివాలీ సంద‌ర్భంగా ఇలా క‌లిసామంటూ చెప్ప‌క‌నే చెప్పింది. ఆ ఫోటోని ఇన్ స్టాలో ఆమె స్వ‌యంగా పోస్ట్ చేసింది. గ్యాంగ్ అంతా న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు. మ‌రి వీరంతా ఎక్క‌డ గేద‌ర్ అయ్యారు? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.



చ‌రణ్ ఈ దీపావ‌ళిని ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. సెలెక్టెడ్ గా కొంత మంది స్టార్స్ ఫ్యామిలీస్ కి పార్టీ ఏర్పాటు చేసాడు. మ‌రి అదే ఈవెంట్ లో ఈ దృశ్యం చోటు చేసుకుందా? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. పిక్ లో అంతా స‌ర‌దాగా న‌వ్వుతూ క‌నిపించ‌డం క‌నువిందు చేస్తుంది. ప్రస్తుతం చ‌ర‌ణ్ రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు.


శంక‌ర్ `భార‌తీయుడు` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌టంతో చ‌ర‌ణ్ కి విశ్రాంతి దొరింది. ఉన్న స‌మ‌యాన్ని ఫ్యామిలీకి...ప్రెండ్స్ కి కేటాయించాడు. సెల‌వొచ్చింద‌ని విదేశాల‌కు వెకేష‌న్ కి వెళ్ల‌లేదు. సాధార‌ణంగా చ‌ర‌ణ్ వెకేషన్ కి వెళ్ల‌డం కూడా చాలా రేర్. ముఖ్యంగా పండ‌గ‌లొచ్చాయంటే కుటుంబంతోనే స‌మ‌యాన్ని గ‌డుపుతాడు