Begin typing your search above and press return to search.

అభిమానులంద‌రి కోసం రాముణ్ణి మోక్కుతా! చ‌ర‌ణ్‌

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు..రామ్ చ‌ర‌ణ్ అయోధ్య రామ‌మందిరం ప్రారంభో త్స‌వంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jan 2024 7:34 AM GMT
అభిమానులంద‌రి కోసం రాముణ్ణి మోక్కుతా! చ‌ర‌ణ్‌
X

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు..రామ్ చ‌ర‌ణ్ అయోధ్య రామ‌మందిరం ప్రారంభో త్స‌వంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఒక రోజు ముందుగానే వీరంతా ప్ర‌త్యేక విమానంలో ఆయోధ్య‌కి చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఆయోధ్య‌లోని అతిధి గృహంలో బ‌స ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసంద‌ర్భంగా రాత్రి స‌మ‌యంలో కూడా అభిమానులు భారీ ఎత్తున గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. దీంతో అభిమానుల్ని ప‌ల‌క‌రించేందుకు చిరంజీవి..చ‌ర‌ణ్ ముందుకొచ్చారు. ఇద్దరు కాసేపు అభిమానుల‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన వీడియోలు కొన్ని లీక‌య్యాయి.

చిరంజీవి మాట్లాడుతూ..` అభిమానులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాద‌ములు. మీ ఉత్సాహం ఎల‌ప్పుడూ ఇలాగే ఉండాలి. మేము అనుకున్న కార్య‌క్ర‌మాలు చేయాలంటే..మా వెంట మీరు ఎప్పుడూ ఉండాలి. సామాజిక కార్య‌క్ర‌మాల్లో భాగ‌మ‌వుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సాహం క‌నిపిస్తేనే మాకు సినిమాలు చేయాలి అనే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఎల్ల‌ప్పుడు మీ ప్రేమాభిమానులు మాకు అవ‌స‌రం. శ్రీరామచంద్రుడి వేష‌ధార‌ణ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్ లో చ‌ర‌ణ్ ఉన్న ఫోటోల్ని ఇలా చూపిస్తుంటే నాకెంతో ఆనందం క‌లుగు తుంది. ఇలాంటివి చ‌ర‌ణ్ కి ఎన‌లేని భ‌ర‌సాని క‌ల్పిస్తాయి. రామ‌జ‌న్మ భూమి పై ప్రాణ ప్ర‌తిష్ట జ‌రుగుతోన్న సంద‌ర్భంగా మీ అందికీ నా సంతోషాన్ని తెలియ‌జేస్తున్నా. జైహింద్` అని అన్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ఎక్క‌డెక్క‌డ నుంచో ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చారు. చాలా సంతోషంగా ఉంది.

రాముడి స‌న్నిధానానికి వెళ్లే అవ‌కాశం నాకు ద‌క్కింది. నా కోసం కాదు..మీ అంద‌రి కోసం రేపు రాముడిని కోరుకుంటా. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ల‌వ్ యూ ఆల్` అని అన్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. చిరంజీవి-చ‌ర‌ణ్ ముందున్న జ‌న‌సందోహం మామూలుగా లేదు. కొంత మంది అభిమానుల‌కు చ‌ర‌ణ్ ఫోటోలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.