Begin typing your search above and press return to search.

చెన్నైలో మెగా ఫ్యామిలీ... ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

VELS యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను అందుకునేందుకు చెన్నై ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అయిన చరణ్‌, ఉపాసన, క్లింకార ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 April 2024 11:35 AM GMT
చెన్నైలో మెగా ఫ్యామిలీ... ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ
X

రామ్‌ చరణ్‌ కుటుంబ సమేతంగా నేడు తమిళనాడులోని చెన్నైకి వెళ్లారు. అక్కడ మీడియా వారు చరణ్‌, ఉపాసన మరియు క్లింకార ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. గతంలో చరణ్ ఎన్నో సార్లు చెన్నై వెళ్లారు, ఉపాసన కూడా చెన్నై కి వెళ్తూనే ఉంటారు. అయితే ఈసారి వెళ్లడం మాత్రం చాలా ప్రత్యేకం.

తమిళనాడకు చెందిన ప్రముఖ VELS యూనివర్సిటీ వారు రామ్‌ చరణ్‌ కు గౌరవ డాక్టరేట్‌ ను అందించబోతుంది. నేడు జరుగబోతున్న VELS యూనివర్సిటీ స్నాతకోత్సవం లో రామ్‌ చరణ్‌ పాల్గొంటాడు. ఆ సమయంలోనే యూనివర్శిటీ పెద్దల చేతుల మీదుగా చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ ను అందుకోబోతున్నాడు.

మెగాస్టార్‌ చిరంజీవి గతంలో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ను అందుకున్నారు. ఇప్పుడు VELS యూనివర్సిటీ నుంచి రామ్‌ చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మెగా ఫ్యామిలీలోనే కాకుండా టాలీవుడ్‌ నుంచి ఈ అరుదైన ఘనత దక్కించుకున్న హీరోగా చరణ్‌ నిలువబోతున్నాడు.

VELS యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను అందుకునేందుకు చెన్నై ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అయిన చరణ్‌, ఉపాసన, క్లింకార ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చరణ్ ఎప్పటిలాగే సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్‌ లో సింప్లీ సూపర్ అన్నట్లుగా ఉన్నాడు. ఇక ఉపాసన కూడా ఆకట్టుకున్నారు. క్లింకార ఫేస్ ను ఈసారి కూడా రివీల్‌ చేయలేదు.

ఇక చరణ్‌ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసే విధంగా నిర్మాత దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

గేమ్‌ చేంజర్ కాకుండా చరణ్‌ ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ను మొదలు పెట్టాడు. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.