Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. హమ్మయ్య టెన్షన్ తీర్చేసిన రామ్ చరణ్

అంతేకాకుండా ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము అని అన్నారు.

By:  Tupaki Desk   |   14 April 2024 4:46 AM GMT
గేమ్ ఛేంజర్.. హమ్మయ్య టెన్షన్ తీర్చేసిన రామ్ చరణ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలైతే ఈ సినిమాను మొదలుపెట్టిన ఏడాదిలోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా దర్శకుడు శంకర్ మరో ప్రాజెక్టుతో బిజీ కావడంతో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది.

దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కెరీర్ లోనే భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక శంకర్ మరొకవైపు ఇండియన్ సీక్వెల్ తో బిజీగా ఉండడం వలన ఈ సినిమా షూటింగ్ కు చాలాసార్లు బ్రేకులు పడ్డాయి. ఇక ఇటీవల ఇండియన్ సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పనులు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు ఫినిష్ కావడంతో పూర్తిస్థాయిలో శంకర్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా పైన ఫోకస్ పెట్టారు.

ఇక దాదాపు ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. అయితే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో శంకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలాసార్లు నిర్మాత దిల్ రాజు తెలియజేశారు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తేజ్ మొత్తానికి ఒక మంచి సందర్భంలో ఈ సినిమా విడుదలపై ఒక క్లారిటీ ఇవ్వడం ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్ని ఇచ్చింది.

రీసెంట్ గా రామ్ చరణ్ కు తమిళనాడు లోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ని ప్రధానం చేసింది. ఇక ఈ వేడుకలో డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనకు ఎంతగానో మద్దతుగా నిలిచిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు. అయితే తన తదుపరి సినిమా గురించి కూడా స్పందించిన రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పూర్తిస్థాయిలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది అని తన కెరీర్ లో ఇలాంటి సినిమా చేయడం ఇదే మొదటిసారి అని కూడా రామ్ చరణ్ వివరణ ఇచ్చాడు.

అంతేకాకుండా ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము అని అన్నారు. అంతే కాకుండా సినిమాను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే చివరి దశకు చేరుకుంది. మొత్తానికి రామ్ చరణ్ తేజ్ కూడా సినిమా విడుదలపై ఎక్కువ టైం పట్టకపోవచ్చు అని చెప్పడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ సినిమాను సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.