Begin typing your search above and press return to search.

పెద్ది రికార్డుల వేట.. అందరిని కొట్టేశాడు!

బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ వీడియో శ్రీరామనవమి రోజున విడుదల కాగా, అది ప్రేక్షకుల మనసులను మంత్రముగ్ధుల్ని చేసింది.

By:  Tupaki Desk   |   7 April 2025 6:17 AM
Peddi Glimpse Records
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ "పెద్ది" పై అంచనాల విషయంలో మొన్నటి వరకు కొన్ని అనుమానాలు ఉండేవి. బుచ్చిబాబు పాన్ ఇండియా మార్క్ కు తగ్గట్టుగా కంటెంట్ ను హైలెట్ చేయగలడా అనే డౌట్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ ఫస్ట్ షాక్ పేరుతో వచ్చిన గ్లింప్స్ తో అన్నిటికీ సమాధానం ఇచ్చాడు. ఫస్ట్ షాట్ రిలీజ్ అయినప్పటి నుంచి టాలీవుడ్‌లో ఓ హవా కనిపిస్తోంది.

బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ వీడియో శ్రీరామనవమి రోజున విడుదల కాగా, అది ప్రేక్షకుల మనసులను మంత్రముగ్ధుల్ని చేసింది. చరణ్ ఊర మాస్ లుక్‌లో చూపించిన ఈ గ్లింప్స్ ఇప్పుడు వ్యూస్ పరంగా భారీ రికార్డు క్రియేట్ చేసింది. "పెద్ది" టీజర్‌కు 24 గంటల్లో 30.6 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం టాలీవుడ్‌లో పాత రికార్డులు బ్లాస్ట్ అయ్యాయి.

ఇప్పటివరకు ఈ రికార్డు ఎన్టీఆర్ నటించిన "దేవర" గ్లింప్స్ పేరిట ఉండగా, ఇప్పుడు రామ్ చరణ్ అదే రికార్డును బ్రేక్ చేసి, న్యూ బెంచ్‌మార్క్ సెట్ చేశాడు. దీనితో పాటు టీజర్‌కు లైక్స్, కామెంట్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తుండటంతో ఇది పక్కా బ్లాక్‌బస్టర్ టాక్ అని చెప్పొచ్చు. విలేజ్ బ్యాక్‌డ్రాప్, బోల్డ్ బాడీ లాంగ్వేజ్, క్రికెట్ గేమ్ యాంగిల్‌తో రూపొందించిన ఈ గ్లింప్స్ చరణ్‌ను కొత్తగా పరిచయం చేస్తోంది.

బుచ్చిబాబు విజువల్ ప్రెజెంటేషన్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. అన్ని కోణాల్లో సినిమా గ్రాండ్ విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. టీజర్‌లోని లాస్ట్ షాట్.. చరణ్ బ్యాట్ తిప్పుతూ బంతిని ఔట్ ఆఫ్ ది పార్క్ కొట్టే సీన్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

ఇక 24 గంటల్లో అత్యధికంగా వీక్షింపబడిన టాలీవుడ్ గ్లింప్స్:

1. పెద్ది - 30.6M+ ** (21 గంటలకే)

2. దేవర - 26.17M

3. గుంటూరు కారం - 20.98M

4. పుష్ప 2: ది రూల్ - 20.45M

5. ది ప్యారడైజ్ - 17.12M

ఈ రికార్డులన్నింటిని బద్ధలుకొట్టి రామ్ చరణ్ తన మార్క్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో వస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుండగా, ఇప్పటి నుంచే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి "పెద్ది" బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.