జాన్వీకపూర్ తో రామ్ చరణ్ లిప్ లాక్!
గురువులను బట్టే శిష్యులు తయారవుతారు. అందుకే ఎప్పటికైనా శిష్యుడు గురువునే మించిపోతాడంటారు. సుకుమార్-బుచ్చిబాబుల గురు శిష్యులను చూస్తుంటే ఇది నిజమయ్యేలా ఉంది.
By: Tupaki Desk | 7 Jun 2025 8:00 PM ISTగురువులను బట్టే శిష్యులు తయారవుతారు. అందుకే ఎప్పటికైనా శిష్యుడు గురువునే మించిపోతాడంటారు. సుకుమార్-బుచ్చిబాబుల గురు శిష్యులను చూస్తుంటే ఇది నిజమయ్యేలా ఉంది. రొమాంటిక్ సన్నివేశాల విషయంలో సుకుమార్ ఎలివేషన్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంలో సుకుమార్ ఎక్కడా రాజీ పడడు. '100 పర్సంట్ లవ్' లో తమన్నాని ఎంత అందంగా చూపించాడో? ఇప్పటికీ ఆ సన్నివేశాలు కళ్ల ముందు ఆడుతూనే ఉంటాయి.
అటుపై 'ఆర్య 2'లో బన్నీ-కాజల్ అగర్వాల్ మధ్య పెదవి ముద్దుల యుద్దం తెలిసిందే. రీసెంట్ గా 'పుష్ప' లో బన్నీ -రష్మికా మందన్నా మధ్య రొమాంటిక్ సన్నివేశాల గురించై తే చెప్పాల్సిన పనిలేదు. ఫీలింగ్స్ పాటే గానీ...ఫీలింగ్స్ వస్తున్నాయి సామీ అనే డైలాగ్ గానీ..కిడ్నాపింగ్ కారులో కిరికిరి సీన్ గానీ అన్నీ సుకుమార్ క్రియేటివిటీ నుంచి జాలువారినవే. అలాంటి గురువు వద్ద శిష్యరికం చేసిన బుచ్చిబాబు తన ట్యాలెంట్ ఏంటి? అన్నది తొలి సినిమా 'ఉప్పెన'తోనే చూపించాడు.
సము ద్రం మధ్యలో జలజల పాటలో హీరో-హీరోయిన్ రొమాన్స్ పీక్స్ లో ఉంటుంది. అంతకు ముందు పరిచయ సన్నివేశాలు అంతే హైలైట్ అవుతాయి. అలా బుచ్చిబాబు కూడా తాను రొమాంటిక్ మేకర్ అని నిరూపించుకున్నాడు. అలాంటి బుచ్చిబాబు 'పెద్ది' విషయంలో కూడా ఆ ఛాన్స్ తీసుకున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. రామ్ చరణ్ -జాన్వీ కపూర్ జంటగా ఈ చిత్రాన్నితెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులోనూ ఘాటైన సన్నివేశాలకు ఏమాత్రం కొదవలేదుట. రామ్ చరణ్-జాన్వీ మధ్య కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయంటున్నారు. అలాగే ఓ స్ట్రాంగ్ లిపికిస్ కూడా సీన్ డిమాండ్ చేయడంతో తొలి షెడ్యూల్ లోనే చిత్రీకరించినట్లు తెలిసింది. ఇంత వరకూ ఈ విషయం బయటకు రాలేదు. జాన్వీ కి కూడా టాలీవుడ్ హీరోతో లిప్ కిస్ అనుభవం ఇదే తొలిసారి. `దేవర`లో ఎన్టీఆర్ తో నటించింది. కానీ కొరటాల శివ రొమాంటిక్ డైరెక్టర్ కాకపోవడంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడా ఆ లెక్కలన్నీ `పెద్ది`తో బుచ్చిబాబు సరి చేస్తున్నాడు.
