అక్కడ కూడా గ్లోబల్ స్టార్ వాయిసే
నిన్న మొన్నటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం కావడం తెలిసిందే.
By: Tupaki Desk | 7 April 2025 11:03 AM ISTశంకర్ డైరెక్ట్ చేసిన `గేమ్ ఛేంజర్` డిజాస్టర్‌తో తీవ్ర నిరాశకు గురైన మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం బుచ్చిబాబు ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. RRRతో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `పెద్ది`. చరణ్ డిఫరెంట్ మేకోవర్‌తో, ఊరమాస్ లుక్‌లో నటిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది.
ఇటీవలే ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని ప్రకటించారు. దీంతో ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా? అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ సర్‌పైజ్ ఇచ్చారు. ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్‌ని విడుదల చేసి చరణ్ క్యారెక్టర్, సినిమా ఏ స్థాయిలో ఉండనుందన్నది చిన్న హింట్ ఇచ్చారు. ఎర్ర జెండాలు చేత పట్టుకుని అంతా జయజయధ్వానాలు చేస్తుంటే ఆకాశం నుంచి దిగివచ్చిన చందంగా చరణ్ పై నుంచి దూకడం, తన లుక్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్, స్క్రీన్ ప్రజెన్స్..మరీ ముఖ్యంగా ఫస్ట్ గ్లింప్స్‌లో లాస్ట్ షాట్ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం కావడం తెలిసిందే. బుచ్చిబాబు అనుకున్న రేంజ్‌లో ఈ సినిమా చేస్తాడా?.. గ్లోబల్ స్టార్ రేంజ్‌లో సినిమాని తెరకెక్కిస్తాడా? అనే అనుమానాలుండేవి. అవన్నీ ఫస్ట్ షాట్‌తో తీరిపోయి `పెద్ది`పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇందులో తొలిసారి రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోగా నటిస్తుండగా, కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించబోతున్నారు.
అంతే కాకుండా మీర్జాపూర్ ఫేమ్ మున్నా అలియాస్ దివ్యేందు శర్మ, జగపతిబాబు కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని గ్లోబల్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. RRRతో ఏర్పడిన గ్లోబల్ మార్కెట్‌ని, క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రామ్‌చరణ్ తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో తన వాయిస్‌నే వినిపించబోతున్నారు. అంతేనా , హిందీ వెర్షన్‌కు కూడా చరణ్ తన వాయిస్‌నే అందించారు. చరణ్ చెబుతున్న హిందీ డైలాగ్స్ సినిమాకు ఉత్తరాదిలో మరింత క్రేజ్‌ని తెచ్చి పెట్టడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే ఇందులో చరణ్ విజయ్ భట్నాగర్ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని తెలిసింది.
