Begin typing your search above and press return to search.

పెద్ది ఎలా ఉంటుందో చెప్పిన చ‌ర‌ణ్‌

అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల సినిమా షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయిన‌ప్ప‌టికీ బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్ ను ఎంతో వేగంగా పూర్తి చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   12 May 2025 6:27 AM
Ram Charan Promises “Peddi” Will Surpass Rangasthalam
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఉప్పెన త‌ర్వాత నుంచి బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ పైనే చాలా టైమ్ కేటాయించి క‌థ‌ను ఎంతో ప‌క‌డ్బందీగా రాసుకున్నాడు.

ఆల్రెడీ పెద్ది నుంచి వ‌చ్చిన గ్లింప్స్ కు కూడా ఆడియ‌న్స్ నుంచి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. బుచ్చిబాబు సినిమాను కూడా గ్లింప్స్ తెర‌కెక్కించిన‌ట్టే తీస్తే థియేట‌ర్ల ద‌గ్గర పెద్ది క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించ‌డం ఖాయం. దానికి తోడు ఈ సినిమా గురించి ఇప్ప‌టికే అంద‌రూ ఎంతో గొప్ప‌గా మాట్లాడుతూ పెద్ది సినిమాపై ఉన్న అంచ‌నాలను పెంచుతూ వ‌స్తున్నారు.

అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల సినిమా షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయిన‌ప్ప‌టికీ బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్ ను ఎంతో వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్ప‌టికే ప‌లు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసిన బుచ్చిబాబు మే 15 నుంచి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించ‌నున్నాడు. షూటింగ్ బ్రేక్ లో చ‌ర‌ణ్ లండ‌న్ కు వెళ్లిన విష‌యం తెలిసిందే.

మేడ‌మ్ టుస్సాడ్స్ లో మైన‌పు విగ్ర‌హావిష్క‌ర‌ణ నేప‌థ్యంలో లండ‌న్ వెళ్లిన చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ స్పెష‌ల్ లైవ్ కాన్స‌ర్ట్ లో కూడా పాల్గొన్నాడు. అందులో భాగంగానే చ‌ర‌ణ్ లండ‌న్ లోని అభిమానుల‌తో మాట్లాడుతూ పెద్ది గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించి సినిమాపై ఆస‌క్తిని ఇంకాస్త పెంచాడు.

పెద్ది సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ 30% పూర్తైంద‌ని చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌, ఈ సినిమా రంగ‌స్థ‌లం కంటే బెట‌ర్ గా ఉంటుంద‌ని చెప్పి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. చ‌ర‌ణ్ కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు బెస్ట్ సినిమా అంటే రంగ‌స్థలం అని చెప్పొచ్చు. అలాంటి రంగ‌స్థలం కంటే పెద్ది బెట‌ర్ గా ఉంటుంద‌ని చ‌ర‌ణ్ చెప్ప‌డంతో పెద్దిపై ఉన్న అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి.