Begin typing your search above and press return to search.

వావ్.. మరోసారి కలిసి వర్క్ చేయబోతున్న చరణ్ ధోని!

అయితే గతంలో కొన్ని కమర్షియల్ యాడ్స్ ద్వారా మహేంద్రసింగ్ ధోనితో కూడా రామ్ చరణ్ కు మంచి పరిచయం ఏర్పడింది

By:  Tupaki Desk   |   4 Oct 2023 8:40 AM GMT
వావ్.. మరోసారి కలిసి వర్క్ చేయబోతున్న చరణ్ ధోని!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టమని కొన్ని ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. అప్పట్లో ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా క్రికెట్ ఆడేందుకు వెళ్లే వాడిని అని కూడా తెలియజేశాడు. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా క్రికెట్ మ్యాచ్లు కూడా వీక్షిస్తాను అని రాంచరణ్ చెబుతూ ఉంటాడు.

ఇక ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా రామ్ చరణ్ కు కొంత మంది ఆటగాళ్లు మంచి స్నేహితులుగా ఉన్నారు. ముఖ్యంగా మాజీ క్రికెట్ ప్లేయర్ గాడ్ ఫాదర్ సచిన్ టెండూల్కర్ చిరంజీవికి మంచి సన్నిహితులు. హైదరాబాద్కు ఎప్పుడు వచ్చినా కూడా చిరంజీవిని కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక అంతేకాకుండా చరణ్ కూడా సచిన్ ను ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాడు.

అయితే గతంలో కొన్ని కమర్షియల్ యాడ్స్ ద్వారా మహేంద్రసింగ్ ధోనితో కూడా రామ్ చరణ్ కు మంచి పరిచయం ఏర్పడింది. అప్పట్లో మగధీరతో సక్సెస్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ కు నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోనితో కలిసి అప్పట్లో పెప్సీ యాడ్లో కూడా కనిపించారు. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు ధోని రామ్ చరణ్ ఇద్దరూ ఒక కమర్షియల్ యాడ్ కనిపించబోతున్నారు.

ఇక ఆఫ్ స్క్రీన్ కు సంబంధించిన ఒక ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో ధోని అయితే డిఫరెంట్ హెయిర్ స్టైల్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నాడు. ఇక పక్కనే రామ్ చరణ్ కూడా తనదైన లుక్కుతో ఆకట్టుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి అలా ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు అని తెలియగానే ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఇక RRR సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న తరువాత రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగానే కాకుండా మిగతా ప్రపంచ దేశాలలో కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక అతనికి ఇంటర్నేషనల్ యాడ్స్ చేసే ఛాన్సులు కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎంఎస్ ధోనితో ఎలాంటి కమర్షియల్ ఆడ్ చేస్తాడో చూడాలి.