Begin typing your search above and press return to search.

ప్రామిస్ బ్రేక్ చేసిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Sep 2023 5:01 AM GMT
ప్రామిస్ బ్రేక్ చేసిన రామ్ చరణ్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తొలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే శంకర్ ఓ వైపు ఇండియన్ 2 చేస్తూనే గేమ్ చేంజర్ ని కూడా పట్టాలు ఎక్కిస్తూ ఉండటం వలన ఆలస్యం అవుతోంది.

నిజానికి రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలో ఆడియన్స్ కి ప్రామిస్ చేశారు. 2024 లోపు కచ్చితంగా ఐదు సినిమాలు తన నుంచి ప్రేక్షకుల ముందుకి వస్తాయని మాటిచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆ మాట నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు రామ్ చరణ్ నుంచి ఆచార్య ఒక్కటే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అది కూడా డిజాస్టర్ అయ్యింది.

ఓ విధంగా చెప్పాలంటే ఆ సినిమా రామ్ చరణ్ మూవీ కాదు. ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే ఆచార్యలో చేశారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా క్లారిటీ లేదు. అలాగే రిలీజ్ సంగతి సరేసరి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా ఈ ఏడాది ఆఖరులో పట్టాలు ఎక్కుతుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యేనాటికి 2025 వచ్చేస్తుంది.

ఈ లెక్కన 2024 నాటికి ఐదు సినిమాలు కంప్లీట్ చేస్తానని ఆ ఇచ్చిన మాట బ్రేక్ అయినట్లే అని చెప్పాలి. అతని ప్లానింగ్ ఎలా ఉన్నా గేమ్ చేంజర్ కి జరుగుతున్న ఆలస్యం కారణంగా మొత్తం ప్రామిస్ తప్పాల్సి వచ్చింది. అయితే ఆడియన్స్ కూడా ఈ ప్రామిస్ గురించి పూర్తిగా మరిచిపోయారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటనకి దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.

ఆ స్థాయిలో కాకున్నా దానిని అందుకునే రేంజ్ మూవీ చూడాలని వెయిట్ చేస్తున్నారు. అది గేమ్ చేంజర్ తో సాధ్యం అవుతుందనే ఆశాభావంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. మరి వారి కోరికని శంకర్ ఎంత వరకు తీరుస్తాడనేది చూడాలి.