Begin typing your search above and press return to search.

రామ్ చరణ్.. ఈ అప్డేట్స్ అన్నీ ఆ రోజే!

రామ్ చరణ్ పుట్టినరోజు. మార్చి 27వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ మెగా హీరో ఫ్యాన్స్ కోసం అప్డేట్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది.

By:  Tupaki Desk   |   7 March 2024 11:29 AM GMT
రామ్ చరణ్.. ఈ అప్డేట్స్ అన్నీ ఆ రోజే!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఫినిష్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వలన ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక మరొకవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా తన 16వ సినిమాను మొదలుపెట్టడానికి చరణ్ సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఒక అప్డేట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఫస్ట్ లుక్ కోసం కూడా ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక చరణ్ మరి కొంత మంది నిర్మాతలతో కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఇక వాటిపై కూడా క్లారిటీ త్వరలోనే రానుంది. అయితే ఎక్కువమంది మాత్రం గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసమే ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది.

కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా బిజీలో పడి గేమ్ ఛేంజర్ పనులు చాలా వరకు వాయిదా వేస్తూ వచ్చాడు. ఇక రామ్ చరణ్ దిల్ రాజు కూడా ఆయనను అర్థం చేసుకుని ప్రాజెక్టును ముందుకు కొనసాగించారు. అయితే ఈ సినిమా తో పాటు మరికొన్ని సినిమాల అప్డేట్స్ అన్నీ కూడా ఒకేరోజు రాబోతున్నాయి.

ఆరోజు మరేదో కాదు. రామ్ చరణ్ పుట్టినరోజు. మార్చి 27వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ మెగా హీరో ఫ్యాన్స్ కోసం అప్డేట్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దర్శక నిర్మాతలతో చరణ్ మాట్లాడడం జరిగింది. ఇక గేమ్ ఛేంజర్ నుంచి అయితే మొదటగా ఒక పోస్టర్ ముందు రోజే వచ్చే అవకాశం ఉంది. ఇక తర్వాత సినిమాలోని ఒక సాంగ్ విడుదల చేయాలని అనుకుంటున్నారు.

జరగండి జరగండి అనే పాట గతంలో లీకైన విషయం తెలిసిందే. అయితే అదే సాంగ్ రావొచ్చని తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అదే రోజు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలగే కొంతమంది ప్రముఖ నిర్మాతలకు కూడా రామ్ చరణ్ సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. అయితే మిగతా ఎవరు కూడా ఇంకా కథలను ఫైనల్ చేయలేదు. కాబట్టి ఆ ప్రొడక్షన్ హౌస్ ల నుంచి కేవలం బర్త్ డే విషెస్ రానున్నాయి.