Begin typing your search above and press return to search.

ఆ బాలీవుడ్ సినిమా కోసం త్రివిక్రమ్..?

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటికే ఎన్నో సార్లు సినీ ప్రియులను అలరించిన రామాయణ గాధ.. మరోసారి అలరించేందుకు రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   4 April 2024 3:00 AM GMT
ఆ బాలీవుడ్ సినిమా కోసం త్రివిక్రమ్..?
X

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటికే ఎన్నో సార్లు సినీ ప్రియులను అలరించిన రామాయణ గాధ.. మరోసారి అలరించేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ఈ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సీతగా సాయి పల్లవి యాక్ట్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఓ ఇన్ స్టా యూజర్ సెట్స్ కు చెందిన ఒక ఫోటోను షేర్ చేసి రామాయణ డే వన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ పిక్ వైరల్ కాగా.. ఆమె కూడా ఈ సినిమాలో వర్క్ చేస్తుందని నెటిజన్లు అంటున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ లో రణబీర్ కపూర్ అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా తెలుగు వెర్షన్‌ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు నితీష్ తివారీ అప్పగించినట్లు సమాచారం. తన మార్క్ డైలాగ్స్ తో త్రివిక్రమ్ అలరించనున్నారట. అయితే ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయో టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా తెలుసు. పురాణాలు, ఇతిహాసాలు, తెలుగు సాహిత్యంపై త్రివిక్రమ్ కు మంచి పట్టు ఉంది. అందుకే త్రివిక్రమ్ కు ఆ బాధ్యతలు అప్పగించారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ రామాయణ ప్రాజెక్ట్.. కొన్ని నెలలపాటు నాన్ స్టాప్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. ముంబయిలో ఓ స్టూడియోలో చిన్న పూజతో ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు అనేక మంది ప్రజల మధ్య పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వివిధ భారతీయ భాషల్లో మూడు పార్టులుగా ఈ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ లో యాక్ట్ చేస్తున్న నటీనటుల వివరాలు కూడా ఆరోజే ప్రకటించనున్నారట. రామాయణంలో కీలక పాత్రధారి అయిన రావణాసురుడి రోల్ లో కేజీఎఫ్ ఫేమ్ యష్ కనిపించబోతున్నట్లు వార్తలు తెగ వస్తున్నాయి. ఈ విషయంపై కూడా రామనవమి రోజే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేద్దాం మరి.