Begin typing your search above and press return to search.

#రామాయ‌ణం.. సేతుపతి విభీష‌ణ‌.. బాబి కుంభ‌క‌ర్ణ‌!

మ‌రో దక్షిణ భారత నటుడు విజయ్ సేతుపతికి విభీషణుడి పాత్రను ఆఫ‌ర్ చేసార‌ని స‌మాచారం.

By:  Tupaki Desk   |   27 Jan 2024 3:00 AM GMT
#రామాయ‌ణం.. సేతుపతి విభీష‌ణ‌.. బాబి కుంభ‌క‌ర్ణ‌!
X

రామాయ‌ణం ఇతిహాసం ఇండియన్ సాగా ఆధారంగా నితీష్ తివారీ కొత్త చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. నటులు రణబీర్ కపూర్ - సాయి పల్లవి వరుసగా రాముడు - సీతాదేవి పాత్ర ల‌కోసం ఎంపిక‌య్యారు. KGF నటుడు యష్ రావణుని ఐకానిక్ పాత్రను పోషించనున్నాడ‌ని ఊహిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా అందింది. మ‌రో దక్షిణ భారత నటుడు విజయ్ సేతుపతికి విభీషణుడి పాత్రను ఆఫ‌ర్ చేసార‌ని స‌మాచారం. దర్శకుడు నితీష్ తివారీ సేతుప‌తితో ప్ర‌స్తుతం చర్చలు జరుపుతున్నార‌ని తెలిసింది.

జవాన్, మెర్రీ క్రిస్మస్ చిత్రాల తర్వాత విజయ్ సేతుపతి బాలీవుడ్‌లో ఫేవరెట్ అయ్యాడు. పాన్-ఇండియన్ స్టార్‌గా తన నిజమైన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అతడు నటించిన ఏ ప్రాజెక్ట్‌కైనా అతని ఉనికి ప్రత్యేకతను తెస్తుంది. అత‌డి అసాధార‌ణ‌ నటన, బలమైన డైలాగ్ డెలివరీ అతడిని ప్రస్తుత కాలంలో ప్ర‌త్యేక న‌టుడిగా నిల‌బెట్టాయి.

ఒక క‌థ‌నం ప్రకారం... విభీషణుడి పాత్ర కోసం నితీష్ తివారీ విజయ్ సేతుప‌తిని సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. విజయ్ ఈ పాత్ర‌లో న‌టించేందుకు ఆసక్తి కనబరిచినా కానీ ఇంకా సంత‌కం చేయ‌లేదు. రణబీర్ కపూర్ లార్డ్ రామ్‌గా నటించబోయే చిత్రంలో విజయ్ సేతుప‌తి నిజంగానే భాగమవ్వడానికి అంగీకరిస్తాడా అనేది ఆసక్తికరం.

రామాయణం ప్రతి కోణంలోనూ భారీ చిత్రం. కథ, నటీనటులు లేదా చిత్రీకరించే విధానం ఏదైనా కావచ్చు.. నితీష్ తివారీ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ లార్జ‌ర్ దేన్ లైఫ్ కంటే పెద్దదిగా ఉంటుంది. మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ ఈ చిత్రానికి నటీనటులను ఖరారు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కైకేయి పాత్రలో లారా దత్తా నటిస్తుండగా, హనుమంతుడిగా గదర్ ఫేమ్ సన్నీ డియోల్ నటిస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. బాబీ డియోల్ కుంభకర్ణుడి పాత్ర కోసం సంప్ర‌దించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ వీటిని అధికారికంగా ఇంకా ధృవీక‌రించ‌లేదు.