Begin typing your search above and press return to search.

రామాయణ మూవీ... షేర్‌ మార్కెట్‌లో భారీ లాభం!

ఇండియన్‌ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ రామాయణ సినిమాను రిలీజ్‌ చేసేందుకు గాను మేకింగ్‌ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశీ భాషల్లో విడుదల చేయడం ద్వారా ఎక్కువ వసూళ్లు సాధించాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 July 2025 11:00 PM IST
రామాయణ మూవీ... షేర్‌ మార్కెట్‌లో భారీ లాభం!
X

బాలీవుడ్‌లో రూపొందుతున్న 'రామాయణ' మూవీ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా, విదేశాల్లో ఉన్న హిందూ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. రణవీర్‌ కపూర్‌ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించబోతుండగా, సీతాదేవి పాత్రలో సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌, లేడీ పవర్‌ స్టార్‌ సాయి పల్లవి కనిపించబోతుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ ప్రకటనకు సంబంధించిన గ్లిమ్స్‌ను విడుదల చేయడం జరిగింది. టైటిల్‌ గ్లిమ్స్‌ తోనే సినిమా స్థాయి అమాంతం పెరిగింది. దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రైమ్‌ ఫోకస్ అనే సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి రెండు పార్ట్‌లుగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చెబుతున్నారు. షూటింగ్‌ పూర్తి అయ్యి, ఫైనల్‌ వర్షన్‌ రెడీ అయితే మూడు పార్ట్‌లు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఇప్పటి వరకు బాలీవుడ్‌లో, సౌత్‌లో ఎన్నో రామాయణం నేపథ్యంలో సినిమాలు వచ్చాయి, వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయి, బుల్లి తెరపై సీరియల్స్ వచ్చాయి. కానీ రణబీర్‌ కపూర్‌, నితీష్ తివారీ కాంబో రామాయణ సినిమాకు మాత్రం అన్ని చోట్ల విపరీతమైన బజ్‌ ఉంది. అదే కథను రణబీర్ కపూర్‌తో నితీష్ తివారీ ఎలా చూపిస్తాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే సినిమా గురించి ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్‌ వర్గాల్లో ఈ సినిమా రెండు పార్ట్‌లు కలిపి దాదాపుగా రూ.4000 కోట్ల నుంచి రూ.5000 కోట్లు వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇండియన్‌ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ రామాయణ సినిమాను రిలీజ్‌ చేసేందుకు గాను మేకింగ్‌ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశీ భాషల్లో విడుదల చేయడం ద్వారా ఎక్కువ వసూళ్లు సాధించాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా రామాయణం ఉంటే ఆ భారీ వసూళ్లు పెద్ద కష్టం కాకపోవచ్చు. అందుకే ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రైమ్‌ ఫోకస్‌ కంపెనీపై జనాల్లో నమ్మకం భారీగా పెరిగింది, త్వరలో భారీగా ఈ కంపెనీకి లాభాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే షేర్‌ మార్కెట్‌లో ప్రైమ్‌ ఫోకస్ కంపెనీకి చెందిన షేర్‌ల విలువ ఒక్కసారిగా పెరిగినట్లు మార్కెట్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

రామాయణ సినిమా టైటిల్ గ్లిమ్స్ విడుదలకు ముందు ప్రైమ్‌ ఫోకస్‌ కంపెనీ షేర్ల ధర 113 రూపాయల 47 పైసలు ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ ఒక్క షేర్‌ ధర దాదాపుగా 170 రూపాయలు ఉంది. తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తం పెరగడం అనేది ఖచ్చితంగా రామాయణ సినిమా వల్లే అనడంలో సందేహం లేదు. ఈ లెక్కన చూసుకుంటే రామాయణ సినిమాకు ఇప్పటికే దాదాపుగా రూ.1200 కోట్ల లాభం వచ్చినట్లు మార్కెట్‌ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. రామాయణ సినిమాకు ముందు ప్రైమ్‌ ఫోకస్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4630 కోట్లు ఉండేది. ఇప్పుడు దాదాపుగా రూ.5700 కోట్లకు చేరిందని తెలుస్తోంది. సినిమా విడుదల సమయంకు మరింతగా కంపెనీ క్యాపిటలైజేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. రామాయణ సినిమా సక్సెస్ అయ్యి లాభాలు తెచ్చి పెడితే అది అదనం అనుకోవాలి.