వివాదంలో రామాయణ సినిమా టైటిల్
అది ఆంగ్లీకరణ కాదని, కన్నడలో దాదాపు ప్రతీ పదం చివరా అ అని వస్తుందని, అది ఆంగ్ల భాష ప్రభావం కాదని, కన్నడిగులకు అది వారి భాష మాత్రమే అని మరికొందరంటున్నారు.
By: Tupaki Desk | 6 July 2025 11:07 AM ISTబాలీవుడ్ లో రామాయణం కథ ఆధారంగా నితీష్ తివారీ రామాయణ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలసిందే. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ పై చితలే గ్రూప్ ఓనర్లలో ఒకరైన నిఖిల్ చితలే ఓ ప్రశ్నను లేవనెత్తారు. ఈ సినిమా టైటిల్ రామాయణ్ అని పెట్టాలని రామాయణ అని కాదని ఆయన అన్నారు.
ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రామాయణ్, రామ్ లాంటి పదాలను ఆంగ్లీకరించడం మానేయాలని ఆయన కోరారు. మన గొప్ప వారసత్వానికి వలసవాద యాస అవసరం లేదని వాల్మీకి రాశారని పేర్కొంటూ ఆయన తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మన వారసత్వ ప్రామాణికతను కాపాడుకోవడంలో ఇది చాలా ముఖ్యమైనదని కొందరు అతన్ని సమర్థించగా, మరికొందరు అతనితో ఏకీభవించలేదు.
అది ఆంగ్లీకరణ కాదని, కన్నడలో దాదాపు ప్రతీ పదం చివరా అ అని వస్తుందని, అది ఆంగ్ల భాష ప్రభావం కాదని, కన్నడిగులకు అది వారి భాష మాత్రమే అని మరికొందరంటున్నారు. సంస్కృతంలో రామ, రామాయణ అనే ఉంటుందని, సినిమాను హిందీలో తీస్తే హిందీ స్పెల్లింగ్ లను ఉంచాలని ఇంకొందరు అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
గురువారం ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ ఇంట్రో గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, ఆడియన్స్ నుంచి దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2026 దీపావళికి రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాకు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
