Begin typing your search above and press return to search.

సీఎంను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రామాయ‌ణం టీమ్

ఈ రెండింట్లో మొద‌టి భాగంగ 2026 దీపావ‌ళికి రిలీజ్ కానుండ‌గా, రెండో భాగం 2027 దీపావ‌ళికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   6 May 2025 12:49 PM IST
సీఎంను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రామాయ‌ణం టీమ్
X

బాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న భారీ సినిమాల్లో రామాయ‌ణం కూడా ఒక‌టి. ఈ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, సాయి ప‌ల్ల‌వి సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. య‌ష్ రావ‌ణుడిగా, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడిగా న‌టిస్తున్నారు. నితేష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ రామాయ‌ణం రెండు భాగాలుగా రూపొందుతుంది.

ఈ రెండింట్లో మొద‌టి భాగంగ 2026 దీపావ‌ళికి రిలీజ్ కానుండ‌గా, రెండో భాగం 2027 దీపావ‌ళికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే రామాయ‌ణం టీజ‌ర్ కోసం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. వాస్త‌వానికి ముంబైలో జ‌రుగుతున్న వేవ్స్ స‌మ్మిట్ లో ఈ టీజ‌ర్ ను స్క్రీనింగ్ చేయాల్సింది.

కానీ ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ఆ స్క్రీనింగ్ ను క్యాన్సిల్ చేశారు. అయితే రామాయ‌ణం టీజ‌ర్ ను ర‌ద్దు చేస్తూ చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని అంద‌రూ ప్ర‌శంసించారు కూడా. 1.36 నిమిషాల నిడివి క‌లిగిన ఈ త్రీడీ టీజ‌ర్ కు CBFC నుంచి యు స‌ర్టిఫికేట్ ల‌భించింది. వేవ్స్ స‌మ్మిట్ లో భాగంగా రామాయ‌ణ పెవిలీయ‌న్ ను భార‌త ప్ర‌ధాని మోదీతో పాటూ మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సంద‌ర్శించారు.

రామాయ‌ణం స్నీక్ పీక్ చూశాక మ‌హారాష్ట్ర సీఎం, చిత్ర నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రాతో మాట్లాడుతూ, రామాయ‌ణం క్వాలిటీని చూసి తాను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని, మ‌న క‌థ‌ల‌ను త‌ర్వాతి త‌రాల‌కు చెప్పాల‌ని మీరు చేస్తున్న ప్ర‌య‌త్నం వ‌రల్డ్ లోనే బెస్ట్ గా ఉంటుంద‌ని న‌మ్ముతున్న‌ట్టు చెప్పి రామాయ‌ణం టీమ్ ను ఎంతో ఆనందానికి గురి చేశారు.

సీఎం వ్యాఖ్య‌ల త‌ర్వాత రామాయ‌ణం టీజ‌ర్ పై అంద‌రికీ ఆస‌క్తి పెరిగింది. త్వ‌ర‌లోనే ఈ టీజ‌ర్ కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే ఛాన్సుంది. రూ.1000 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా టీజ‌ర్ రిలీజ‌య్యాక దాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయ‌మ‌ని బాలీవుడ్ మీడియా వర్గాలంటున్నాయి.