కళ్ళు చెదిరే రామాయణ ఓటీటీ డీల్.. నిర్మాత ఏమన్నారంటే?
ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత నమిత్ మల్హోత్రా, కన్నడ స్టార్ హీరో యష్ కలసి నిర్మిస్తున్న చిత్రం రామాయణ.
By: Madhu Reddy | 4 April 2026 12:22 PM ISTప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత నమిత్ మల్హోత్రా, కన్నడ స్టార్ హీరో యష్ కలసి నిర్మిస్తున్న చిత్రం రామాయణ. ఏకంగా 4వేల కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ ప్రమాణాలతో కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భాగాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో భారీ తారాగణం భాగమైన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా, రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీడియోల్ హనుమాన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు. ఇక వీరే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్, ఇందిరా కృష్ణ, కాజల్ అగర్వాల్, సురభి దాస్ ఇలా తదితరులు ఇందులో భాగమైన విషయం తెలిసిందే .
వేలకోట్ల బడ్జెట్ , అద్భుతమైన వీఎఫ్ఎక్స్, హాలీవుడ్ ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి రాముడి పాత్రను రివీల్ చేస్తూ ఇటీవల చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ముఖ్యంగా అయోధ్యలోకి రాముడు ఎంట్రీ ఇవ్వడం.. విల్లుపట్టిన ఆయన లుక్ చూసి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది అనడంలో సందేహం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రముఖ బడా ఓటీటీ ప్లాట్ ఫామ్ రామాయణ సినిమాకు సుమారుగా రూ.700 కోట్ల భారీ ఆఫర్ అందించింది. అయితే ఈ ఆఫర్ ను నిర్మాత నమిత్ మల్హోత్రా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ఉన్న పౌరాణిక వారసత్వం, ఫ్రాంచైజీ సామర్థ్యం తో పాటు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ కారణంగానే ఈ చిత్రానికి విలువ ఎక్కువ లభించాలనే ఆలోచనతోనే నమిత్ మల్హోత్రా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే పెట్టిన పెట్టుబడిని సులభంగా తిరిగి రాబట్టుకోవడానికి, నష్టం ఏర్పడుతుందేమో అనే భయాన్ని తగ్గించుకోవడానికి.. వేగంగా డిజిటల్ , సాటిలైట్, సంగీత హక్కులను అమ్మకుండా.. ముందస్తు ప్రణాళికలతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో విడుదల చేసి ఆ తర్వాతే లాభాలను పొందాలని నిర్మాత ఆలోచిస్తున్నారట.
అందుకే ఆర్థిక లాభం కోసం చూడకుండా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసి, ప్రపంచవ్యాప్త చలనచిత్ర దృశ్య కావ్యంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇంతటి భారీ ఓటీటీ డీల్ ఆఫర్ ను తిరస్కరించడంతో ఈ విషయం అందరిని ఆశ్చర్యపరిచినప్పటికీ.. నమిత్ మల్హోత్రా తన సినిమా కథపై ఉన్న నమ్మకాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రేక్షకుల ముందుకు రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకొని ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
