రామాయణ్ కోసం అంతటి లెజెండ్ తో పని చేస్తామని ఊహించుకున్నామా : రెహ్మాన్
భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది బాలీవుడ్ రామాయణ్ సినిమా.
By: Tupaki Desk | 19 July 2025 8:00 AM ISTభారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది బాలీవుడ్ రామాయణ్ సినిమా. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్ర నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 4000 వేల కోట్ల ఖర్చుతో ఈ సినిమా రూపొందుతోంది. ఆడియెన్స్ కు హై క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ ఇంటర్నేషన్ లెవెల్ క్యాస్టింగ్ ను ఈ సినిమాలో తీసుకున్నారు.
ఇటీవల మేకర్స్ ఈ సినిమా నుంచి వీడియో గ్లింప్స్ వదిలారు. ఇందులో విజువల్స్ ఓ లెవెల్ లో ఉంటే బ్యాగ్రౌండ్ మరో లెవెల్ లో ఉంది. ఈ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వీడియో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలాగే ఈ వీడియోతో స్టార్ క్యాస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ తోపాటు హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నట్లు ప్రకటన చేశారు.
అయితే రీసెంట్ గా రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన రామాయణ్ ప్రాజెక్ట్ గురించి, అలాగే హాలీవుడ్ లెజెండ్ జిమ్మర్ తో కలిసి పని చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. అంతటి లెజెండరీతో రామాయణ్ లాంటి ప్రాజెక్ట్ కు పనిచేయడం ఎప్పుడూ ఊహించలేదని రెహ్మాన్ అన్నారు. జిమ్మర్ తో జరిగిన మొదటి సన్నవేశాన్ని గుర్తు చేసుకున్నారు.
రామాయణ్ ప్రాజెక్ట్ పై జిమ్మర్ తో పలు సెషన్స్ అద్భుతంగా జరిగాయి. లండన్తో తొలి సెషన్, లాస్ ఏంజిలెస్ లో రెండో సెషన్, దుబాయ్ లో మూడో సెషన్ మీటింగ్స్ జరిగాయి. అతడితో సంభాషించడం చాలా సులభం. దాదాపు అతను నాకు సిమిలర్ గా ఉంటారు. అలాగే ఆయనకు మన భారతీయ సంస్క్డతి గురించి తెలుసుకోడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. అని రెహ్మాన్ అన్నారు.
కాగా, ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ సినమాకు పని చేస్తున్నాయి. ఇందులో రణ్ బీర్ కపూర్ రాముడిగా, అలాగే సాయి పల్లవి సీత పాత్రల్లో నటిస్తున్నారు. కన్న స్టార్ యష్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ లాంటి ఇతర బిగ్ స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 దీపావళికి తొలి భాగం, రెండో పార్ట్ 2027 దీపావళి కి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
