రామాయణ కోసం ఫారిన్ మ్యూజిక్ డైరెక్టర్.. మరోసారి అదరగొట్టేస్తారా?
తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గ్లింప్స్ రిలీజ్ చేస్తూ.. వారిద్దరి పేర్లను మ్యూజిక్ డైరెక్టర్స్ గా అనౌన్స్ చేశారు.
By: Tupaki Desk | 4 July 2025 12:18 PM ISTరామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ లో రామాయణ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్నారు.
రెండు భాగాల్లో రానున్న రామాయణ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. మేకర్స్ ప్రకటించకపోయినా.. సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోస్ రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండో భాగం షూటింగ్ ఇప్పుడు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా మరికొద్ది నెలల్లో పూర్తి చేయనున్నారట మేకర్స్.
అయితే రామాయణ మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ వర్క్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గ్లింప్స్ రిలీజ్ చేస్తూ.. వారిద్దరి పేర్లను మ్యూజిక్ డైరెక్టర్స్ గా అనౌన్స్ చేశారు.
దీంతో ఇప్పుడు రామాయణ మూవీ సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. తన సంగీతంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు ఏఆర్ రెహమాన్. ఆయనకు హన్స్ జిమ్మెర్ తోడయ్యారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ సంగీత స్వరకర్తల్లో ఒకరన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అనేక టాప్ హాలీవుడ్ మూవీస్ కు వర్క్ చేశారు. ఇంటర్ స్టెల్లార్, ది లయన్ కింగ్, డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్ బిగిన్, నైట్ రైజెస్ వంచి వివిధ సినిమాలకు మరపురాని అవుట్ పుట్ ఇచ్చారు. అవే కాదు.. దాదాపు అన్నీ భారీ సినిమాలకు ఆయనే బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఇండియన్ మూవీకి పనిచేస్తున్నారు.
అది కూడా రామాయణ సినిమాకు వర్క్ చేయడం విశేషం. ఈ కథ గురించి వివరించగానే వెంటనే అంగీకరించారట. అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందులో కచ్చితంగా హాన్స్ జిమ్మెర్ సహకారం ఉందని అర్థమవుతోంది. గ్లింప్స్ కు ఆ రేంజ్ లో అందిస్తే.. ఇంకా సినిమాకు ఎలాంటి అవుట్ పుట్ ఇస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు.
