Begin typing your search above and press return to search.

'రామాయణ' గ్లింప్స్.. 5 వేల సంవత్సరాలు అన్నారేంటి?

బాలీవుడ్ రామాయణ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను మేకర్స్ రీసెంట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 July 2025 1:00 PM IST
రామాయణ గ్లింప్స్.. 5 వేల సంవత్సరాలు అన్నారేంటి?
X

బాలీవుడ్ రామాయణ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను మేకర్స్ రీసెంట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్లింప్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వీఎఫ్ ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్స్ అదిరిపోయాయనే చెప్పాలి.

అయితే గ్లింప్స్ ను కాలం ఉనికిలో ఉన్నప్పటి నుంచి త్రిముూర్తులు ముల్లోకాలను పరిపాలిస్తున్నారంటూ రైటప్స్ తో మేకర్స్ స్టార్ట్ చేశారు. "బ్రహ్మ సృష్టించే దేవుడు, విష్ణువు రక్షించే దేవుడు, శివుడు అంతం చేయగలిగే దేవుడు. కానీ వారి సృష్టి మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురుతిరిగినప్పుడు యుద్ధం ప్రారంభమైంది" అని రాసుకొచ్చారు.

"5000 సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలచే ఆరాధించేది ఇదే. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ. రాముడు vs రావణుడు, రావణుడు శక్తి, ప్రతీకారం. రాముడు ధర్మం, త్యాగం" అంటూ తెలిపారు. అక్కడి వరకు బాగున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. పొరపాటు జరిగిందని మట్లాడుకుంటున్నారు.

రామాయణం 5000 సంవత్సరాల ఏళ్ల క్రితంది కాదని నెటిజన్లుకు కామెంట్లు పెడుతున్నారు. వాల్మీకి ప్రకారం, lమన్వంతర 24వ మహాయుగానికి రామాయణం చెందుతుందని అంటున్నారు. మనం ప్రస్తుతం 28వ శతాబ్దంలో ఉన్నామని చెబుతున్నారు. ఏదేమైనా రామాయణం కాలం ప్రస్తావన చాలా అస్పష్టంగా ఉందని అంటున్నారు.

దానిపై ఎవరికీ క్లారిటీ లేదని మరికొందరు అంటున్నారు. అందుకే నిర్దిష్ట సమయాన్ని మేకర్స్ సూపర్ టెక్స్ట్ రూపంలో ముద్రించకుండా ఉండాల్సిందని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. గ్లింప్స్ తో మేకర్స్ మరోసారి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. 2026 దీపావళికి రామాయణ తొలి భాగాన్ని.. 2027 దీపావళికి రెండో భాగాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.

ఇక మూవీ విషయానికొస్తే.. సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రవి దుబే లక్ష్మణుడిగా యాక్ట్ చేస్తున్నారు. సన్నీ డియోల్.. హనుమంతుడిగా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ మండోదరిగా సందడి చేయనున్నారు. సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఆస్కార్ విన్నింగ్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. వారితోపాటు మరికొందరు టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.