రామాయణ్ రన్ టైమ్.. నోరు జారిన రణబీర్ కపూర్.. సాధ్యమేనా?
ఇక ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
By: Madhu Reddy | 4 April 2026 4:47 PM ISTఒక్క గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచేసి.. ప్రపంచవ్యాప్తంగా ఊహించని ఇమేజ్ సొంతం చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ. దాదాపు 7 సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నానని.. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం ఎలా ఉంటుందోనని.. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తనకు రామాయణ్ మూవీ నుంచి రాముడి పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఊహించని ఊరట కలిగించింది. అని డైరెక్టర్ నితేష్ తివారీ తెలిపిన విషయం తెలిసిందే.
అలా రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నిడివి గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు రావడంతో అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో రాముడు పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా ఈ సినిమా రన్ టైం గురించి లీక్ చేశారు. రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. "రామాయణం అనేది ఒక గొప్ప మహాకావ్యం.. దీనిని ఏమాత్రం కుదించకుండా ప్రతి కీలక ఘట్టాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించేందుకు.. సుమారుగా 6 గంటల ఎపిక్ విజువల్స్ తో ఈ సినిమా రాబోతోంది" అంటూ రణబీర్ కపూర్ తెలిపారు.
ఇక ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం ఈ నిడివి ఒకే భాగానికి సంబంధించిందా లేక రెండు భాగాల మొత్తం కలిపి దీనిపై క్లారిటీ ఇచ్చారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.. ఒకవేళ ఒక్కో భాగం మూడు గంటల చొప్పున ఉంటే గనుక అది ప్రేక్షకులకు ఒక గొప్ప విజువల్ ట్రీట్ అవుతుంది. కానీ ఒక భాగం ఆరు గంటలు అంటే .. ఆ 6 గంటలసేపు ప్రేక్షకుడిని థియేటర్లలో కూర్చోబెట్టడం సాధ్యమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి రణబీర్ కపూర్ రివీల్ చేసిన ఈ నిడివి దేనికి సంబంధించింది అనే విషయంపై క్లారిటీ వస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుతున్నారు. ఇకపోతే ఇంత సుదీర్ఘమైన రన్ టైం తో రామాయణాన్ని వెండితెరపై చూపించడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం అని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. మరి నితేష్ తివారీ తన ప్రతిభను తెరపై ఏ విధంగా ప్రదర్శించనున్నారో తెలియాలి అంటే దీపావళి వరకు ఎదురు చూడాల్సిందే.
ఈ సినిమాను సుమారుగా రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ తో యష్ , నమిత్ మల్హోత్ర నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో.. కన్నడ హీరో యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అలాగే సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ వంటి భారీతారాగణం కూడా ఇందులో భాగమైంది . ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
