ఆ సినిమాలో హనుమంతుడి విశ్వరూపం ఇలా!
బాలీవుడ్ లో 'రామాయణం' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రూపొందుతుంది.
By: Tupaki Desk | 12 July 2025 3:00 AM ISTబాలీవుడ్ లో 'రామాయణం' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రూపొందుతుంది. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్...సీత పాత్రలో సాయి పల్లవి...రావణాసురుడు పాత్రలో యశ్, కైకేయిగా లారాదత్తా, శూర్ఫణకగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇందులో పాత్రలను పరిచయం చేస్తూ ఇటీవల రిలీజ్ చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు. అద్బుతమైన ఆహార్యంతో ఆకట్టుకున్నారు.
కొన్ని నిమిషాల వీడియోనే ఓ అద్భుతంలా ఉంది. సినిమాలో ఆ పాత్రలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకుల ఊహకందని సన్నివేశాలు ఎన్నో ఉంటాయని తెలుస్తోంది. ఇక హనుమంతుడి పాత్రలో సన్ని డియోల్ నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రామయణం తెరకెక్కుతోంది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. రెండవ భాగం షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. మొదటి భాగంతో పనిలేకుండా కంటున్యూగా చేస్తున్నారు.
సాధారణంగా రెండవ భాగం అన్నది మొదటి భాగం రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసుకుని చేస్తారు. కానీ నితీష్ తివారీ మాత్రం ఎంతో కాన్పిడెంట్ గా ముందుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే మొదటి భాగం రిలీజ్ మయం కూడా ఫిక్స్ చేసారు. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇందులో హనుమంతుడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. మొదటి భాగంలో హనుమంతుడి పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అంతకు మించి హనుమ పాత్ర ఉండదని తెలుస్తోంది.
రెండవ భాగంలో మాత్రం ఎక్కువ సేపు ఉంటుందని చెబుతున్నారు. రామ-రావణ యుద్దం అన్నది రెండవ భాగంలో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో హనుమంతుడి పాత్ర కూడా అక్కడే హైలైట్ అవుతుంది. లంకను తగలబెట్టడం... సంజీవని కోసం పర్వాతాన్నే ఎత్తి తీసుకురావడం వంటి సన్ని వేశాలన్ని హనుమతుడితోనే ఉంటాయి. కాబట్టి ఆ పాత్రకు రెండవ భాగంలో పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది.
