రామాయణ్ కు రెహమాన్, జిమ్మర్.. కానీ అలా ఎందుకు?
లక్ష్మణుడి పాత్రలో రవిదూబే, హనుమంతుడిగా సన్నీ డేవోల్ కనిపించబోతున్నారు. రెండు భాగాల్లో సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 17 July 2025 7:00 PM ISTప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ లో రామాయణ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రాముడిగా బీటౌన్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కనిపించనున్నారు. సీతగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి యాక్ట్ చేస్తున్నారు. రావణుడి పాత్రలో కన్నడ స్టార్ నటుడు యష్ నటిస్తున్నారు.
లక్ష్మణుడి పాత్రలో రవిదూబే, హనుమంతుడిగా సన్నీ డేవోల్ కనిపించబోతున్నారు. రెండు భాగాల్లో సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని సమాచారం.
రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అందులో బ్యాక్ గ్రౌండ్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో సినిమాకు హాలీవుడ్ దిగ్గజం ఆస్కార్ అవార్డు విన్నర్ హన్స్ జిమ్మర్ తో పాటు ఇండియన్ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్.. వర్క్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
అయితే రామాయణ్ మూవీకి సంగీతం అందించడం ద్వారా హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత డీఎన్ ఈజీ వీఎఫ్ఎక్స్ స్టూడియో కూడా రామాయణ్ ప్రాజెక్ట్ లో భాగం కావడంతో కచ్చితంగా అద్భుతమైన అవుట్ పుట్ వస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ఇద్దరు దిగ్గజాలు సినిమాకు వర్క్ చేస్తున్నప్పటికీ.. మూవీ ప్రమోట్ చేసే విషయంలో వాళ్ల పేర్లను ఉపయోగించుకోవడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సూపర్ టాలెంట్ ఉన్నప్పటికీ.. అలా చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
సౌత్ కు నార్త్ కు అదే తేడా అని అంటున్నారు.
బాలీవుడ్ లో స్టార్ క్యాస్టింగ్ నే ప్రమోట్ చేస్తారని, సంగీత దర్శకులు, గాయకులు ఇతర సాంకేతిక నిపుణులను పక్కన పెడుతారని ఆరోపిస్తున్నారు. తెర వెనుక ఉన్న ఉన్నవారిని పట్టించుకోరని అంటున్నారు. బాలీవుడ్ లో గాయకుడు, సంగీత దర్శకుడు, గీత రచయితలు, స్టంట్ కొరియోగ్రాఫర్లు లేదా సాంకేతిక నిపుణులను ఎప్పుడూ ఎవరూ ప్రశంసించరని అంటున్నారు. కానీ టాలీవుడ్ లో దానికి విరుద్ధంగా ఉంటుందని చెబుతున్నారు.
