'రామాయణం' మార్కెట్ పెంచే వ్యూహం
మే 1 నుంచి 4 వరకూ జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో రామాయణం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలిసింది.
By: Tupaki Desk | 27 April 2025 11:15 AM ISTయానిమల్ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ డమ్ ని అందించిన తర్వాత రణబీర్ కపూర్ ప్రణాళికలు అమాంతం మారాయి. అతడు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రామాయణంలో నటిస్తున్నాడు. దంగల్, చిచ్చోర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించిన నితేష్ తివారీ ఈ ఫ్రాంఛైజీకి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సిరీస్ ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించనున్నామని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదలవుతాయి.
పాత్రలు, పాత్రధారుల ఎంపిక ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. శ్రీరాముడిగా రణబీర్ , సీతగా సాయిపల్లవి నటిస్తుండగా, కీలకమైన పాత్రల్లో సన్నీడియోల్, బాబి డియోల్ తదితరులు నటిస్తున్నారు. అభిమానులు ఫస్ట్ లుక్ కోసం వేచి చూస్తున్న ఈ ప్రత్యేక తరుణంలో ఒక శుభవార్త అందింది.
మే 1 నుంచి 4 వరకూ జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో రామాయణం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలిసింది. ది వేవ్స్ సమ్మిట్ -2025 దేశంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రముఖులంతా ఈ ఈవెంట్ కి అటెండవుతున్నారు. అలాంటి చోట రామాయణం గ్లింప్స్ రిలీజ్ చేయాలనేది సరైన ఆలోచన. దీనిని నితీష్ తివారీ నిరభ్యంతరంగా అమల్లో పెడుతున్నారు. రామాయణం -1 మొదటి పోస్టర్ లేదా వీడియోను విడుదల చేయాలనేది ప్లాన్. ప్రస్తుతం దీనిపై చిత్రబృందం సీరియస్ గా వర్క్ చేస్తోందని సమాచారం. వేవ్స్ వేదికగా రామాయణం టీమ్ గ్రాండ్ ప్రమోషన్స్ ని ప్రారంభించే యోచనతో ఉంది.
రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రంలో రాక్షస రాజు రావణుడిగా నటిస్తుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అరుణ్ గోవిల్, లారా దత్, ఇందిరా కృష్ణ, మరియు రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
