'రామాయణం'లో రాముడు-రావణుడు మిస్సింగ్
నితీష్ తివారీ `రామాయణం`లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 July 2025 8:11 PM ISTనితీష్ తివారీ `రామాయణం`లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే టాకీ పూర్తయినట్టు చిత్రబృందం ధృవీకరించింది. అలాగే ఈ సినిమా టైటిల్ టీజర్ గ్లింప్స్ ని ఈ నెల 3న లాంచ్ చేసేందుకు చిత్రబృందం ప్రిపరేషన్ లో ఉంది. ముంబై ఐమ్యాక్స్ లో కొద్దిమంది అతిథులు, అభిమానుల సమక్షంలో వేడుకను నిర్వహించేందుకు నితీష్ -నమిత్ మల్హోత్రా బృందం సిద్ధమవుతున్నారని సమాచారం. రామాయణం కి సంబంధించిన కీలక మీడియా సమావేశమిది.
అయితే అత్యంత కీలకమైన ఈ ప్రచార వేదికపై శ్రీరాముడు, రావణాసురుడు మిస్సవుతున్నారని సమాచారం. ఈవెంట్ కి రణబీర్, యష్ స్కిప్ కొడుతున్నారు. దీనికి కారణం యష్ ఇప్పటికే తన భార్య, పిల్లలతో కలిసి అమెరికా విహారయాత్రకు పయనమయ్యారు. తాను వేడుకకు హాజరు కాలేనని కూడా అతడు ప్రకటించారు. మరో భారీ యాక్షన్ చిత్రం `టాక్సిక్` చిత్రీకరణను ముగించి వెంటనే `రామాయణం`తో బిజీ అయిన యష్ పూర్తి విశ్రాంతిని కోరుకున్నాడు. ఆదివారం రాత్రి అతడు కుటుంబంతో అమెరికా పయనమయ్యాడని సమాచారం.
అదే సమయంలో రణబీర్ కపూర్ తన భార్య ఆలియా, కిడ్ రాహాతో కలిసి లండన్ లో ఉన్నారు. అంటే అతడు కూడా కీలకమైన ఈవెంట్ కి స్కిప్ కొడుతున్నారన్నమాట. ఇద్దరు ముఖ్యమైన స్టార్లు ప్రచార వేడుకలో కనిపించకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగల్చనుంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, యష్, కాజల్ అగర్వాల్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా -యష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామాయణం -1 దీపావళి 2026 కానుకగా విడుదల కానుండగా, రామాయణం 2 దీపావళి 2027 కానుకగా విడుదలవుతుంది.
