'బాహుబలి 2' ఒక్కటే కాదు..దంగల్ రికార్డులు చెరిపేస్తాడా?
'దంగల్' తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా 'బాహుబలి-2' రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 July 2025 2:00 AM IST'దంగల్' తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా 'బాహుబలి-2' రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 'దంగల్' 2000 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తే 'బాహుబలి ది కన్ క్లూజన్' 1800 కోట్ల వసూళ్లను సాధించింది. 'పుష్ప 2' రిలీజ్ ముందు వరకూ బాహుబలి 2 వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద రెండవ స్థానంలో కొనసాగింది. ఈ సినిమాతో రాజమౌళి కీర్తి విశ్వవ్యాప్తమైంది. దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. రాజులు..రాజవంశాల కాన్సెప్ట్ ఆధారంగా బాహుబలి కథను జక్కన్న ట్రీట్ చేసిన విధాననికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
'బాహుబలి' కంటే ముందే ఇలాంటి ప్రయోగాలెన్నో బాలీవుడ్ చేసింది. కానీ బాహుబలి రేంజ్ ప్రాచుర్యం మాత్రం ఏ సినిమాకు దక్కలేదు. ఆ రేంజ్ సక్సెస్ ని అందుకోలేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఉన్న సినిమా ఏది? అంటే రామాయణం అని కచ్చితంగా చెప్పొచ్చు. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో...సాయి పల్లవి సీత పాత్రలో నితీష్ తివారీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ కాన్సాస్ పై తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
అదెంతలా? అంటే 'బాహుబలి' రేంజ్ సినిమా రామాయణం అవుతుందని దేశమంతా భావిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో నితీష్ మేకింగ్ శైలి అర్దమైంది. ఇంత వరకూ నితీష్ చారిత్రాత్మక సినిమాలు తీయలేదు. రామాయణంతోనే ఎంటర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది? అన్న సందేహాలు ఎంత మాత్రం అవసరం లేదు. ఎందుకంటే 'దంగల్' లాంటి సంచలనం చేసింది కూడా ఈయనే.
'రామాయణం' కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంచనా ప్రకారం 10-12 కోట్ల మంది అభిమానులు రామాయణం కోసం ఎదురు చూస్తున్నట్లు సర్వేలు చెబుతున్నారు. రామాయణం అంతకు మించే ఉంటుంది. ఈ నేపథ్యంలో 'బాహుబలి 2' రికార్డులు మాత్రమే కాదు దంగల్ రికార్డులను కూడా ఈ సినిమా చెరిపేయడం ఖాయమనే ప్రచారం మొదలైంది.
