రామాయణ మేకర్స్ తెలివైన ప్లాన్
బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 July 2025 6:00 AM ISTబాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనుండగా, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం రామాయణ మేకర్స్ ఈ సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణం ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా చూసుకోవడానికి కొత్త ప్లాన్స్ చేస్తున్నారు. 2026లో సినిమా రిలీజయ్యే వరకు సినిమాతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ మీడియాతో మాట్లాడకుండా ఉండాలని మేకర్స్ వారికి సూచించారట. ఇప్పటికే రణ్‌బీర్, సాయి పల్లవి సాధారణ ఆడియన్స్ మనోభావాలను దెబ్బతీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వారు ఆల్రెడీ వివాదాల్లో ఉన్నప్పటికీ మీడియా ముందుకొచ్చి వారితో సంభాషిస్తే మరిన్ని వివాదాలకు దారి తీసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని నిర్మాతలు ఆందోళన పడుతున్నారు. గతంలో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ నుంచి నిర్మాతలు ఈ గుణపాఠాన్ని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇది అమలు జరిగితే మంచి నిర్ణయమే అవుతుంది.
ఆదిపురుష్ లో ఓం రౌత్ చేసిన తప్పులతో పోలుస్తూ, ఓ వర్గం ఆడియన్స్ ఇప్పటికే రణ్‌బీర్‌ను రాముడిగా అంగీకరించారు. రణ్‌బీర్ ను ఒప్పుకున్నారని మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆడియన్స్ నుంచి సానుకూల స్పందన వస్తుందని చెప్పలేం. రామాయణలోని అన్ని పాత్రల ఫస్ట్ లుక్స్ బయటికొచ్చే వరకు ఏదీ చెప్పలేం. మేకర్స్ సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ ను మీడియాను దూరంగా ఉంచినప్పటికీ, మూవీలోని ఆయా పాత్రల ఫస్ట్ లుక్ కూడా ఇబ్బందులకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి డైరెక్టర్ సినిమాలోని పాత్రల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
