Begin typing your search above and press return to search.

రమణి కళ్యాణం.. పెళ్లి పాట అదిరింది

సినిమాకి పాటలు హిట్ అయితే ఆ సినిమాపై అంచనాలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి పాటలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయితే అవి ఫంక్షన్స్ నుంచి సోషల్ మీడియాలో వరకు ఎక్కడైనా వినిపిస్తుంటాయి.

By:  Tupaki Desk   |   15 May 2026 12:25 PM IST
రమణి కళ్యాణం.. పెళ్లి పాట అదిరింది
X

సినిమాకి పాటలు హిట్ అయితే ఆ సినిమాపై అంచనాలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి పాటలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయితే అవి ఫంక్షన్స్ నుంచి సోషల్ మీడియాలో వరకు ఎక్కడైనా వినిపిస్తుంటాయి. ఇప్పుడు రమణీ కళ్యాణం టైటిల్ సాంగ్ కూడా అలాంటి ఫీల్‌నే తీసుకొచ్చింది. ఇప్పటికే టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు టైటిల్ ట్రాక్‌తో ఆ ఆసక్తిని మరింత పెంచేసింది.

వినగానే హుషారుగా అనిపించే ట్యూన్, పెళ్లి వాతావరణాన్ని గుర్తు చేసే విజువల్స్, ఫీల్‌గుడ్ ఎనర్జీ ఈ పాటకు పెద్ద ప్లస్ అయ్యాయి. పాట మొత్తం ఒక అందమైన పెళ్లి సంబరంలా సాగుతూ ప్రేక్షకులను మంచి మూడ్‌లోకి తీసుకెళ్తోంది.

హరిచరణ్, రమ్యా బెహరా తమ వాయిస్‌తో పాటకు మంచి ఎనర్జీ తీసుకొచ్చారు. పూర్ణచారి రాసిన లిరిక్స్ వెంటనే గుర్తుండిపోయేలా ఉన్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ ఎస్ కురుప్ ఇచ్చిన ట్యూన్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఒక్కసారి వింటే మళ్లీ వినాలనిపించేలా కంపోజ్ చేశారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో ఈ సాంగ్ ఎక్కువగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విజువల్స్ కూడా పాటకు మరో హైలెట్‌గా నిలిచాయి. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంట చాలా క్యూట్‌గా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా అనిపించింది. కలర్‌ఫుల్ వెడ్డింగ్ సెటప్, లైవ్లీ విజువల్స్ పాటను మరింత అందంగా మార్చాయి.

విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రమణీ కళ్యాణం సినిమాను కైట్స్ క్రియేటివ్స్ నిర్మిస్తోంది. కోర్ట్ ఫేం రామ్ జగదీష్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. టీజర్ తర్వాత ఇప్పుడు టైటిల్ సాంగ్ కూడా మంచి బజ్ తీసుకురావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.