Begin typing your search above and press return to search.

రామ‌య్యా వ‌స్తావ‌య్యా.. SRK స్వాగ్.. న‌యన్ గ్లామ్ మెరుపులు

''రామయ్య వస్తావయ్యా..'' అంటూ సాగే ఈ పాట పాతకాలపు 'రామయ్యా వస్తావయ్యా..' పాటకి రీహాష్‌గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సాహిత్యం కంటే.. విజువ‌ల్ మెరుపులు ఎంతో ఆక‌ట్టుకున్నాయ‌ని చెప్పాలి.

By:  Tupaki Desk   |   29 Aug 2023 3:32 PM GMT
రామ‌య్యా వ‌స్తావ‌య్యా.. SRK స్వాగ్.. న‌యన్ గ్లామ్ మెరుపులు
X

కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన‌ తాజా చిత్రం 'జవాన్' సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మేకర్స్ సినిమాలోని పాటలను ఒక్కొక్క‌టిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు సూపర్‌హిట్ పాటలు విడుద‌లై ఆక‌ట్టుకున్నాయి. అనిరుధ్ కంపోజ్ చేసి పాడిన మూడవ పాట తాజాగా విడుద‌లైంది. ఈ పాట‌లో ఖాన్ తో న‌య‌న్ స్టెప్పులు విరుపులు మ‌తులు చెడ‌గొడుతున్నాయి.


''రామయ్య వస్తావయ్యా..'' అంటూ సాగే ఈ పాట పాతకాలపు 'రామయ్యా వస్తావయ్యా..' పాటకి రీహాష్‌గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సాహిత్యం కంటే.. విజువ‌ల్ మెరుపులు ఎంతో ఆక‌ట్టుకున్నాయ‌ని చెప్పాలి. షారూఖ్ ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు నయనతార గ్లామ్ అవతార్ ఈ పాట‌లో ఎంతో గొప్ప‌గా క‌నిపిస్తున్నాయి. తెలుగు వెర్షన్‌లో గాయకుడు శ్రీరామచంద్ర విన‌సొంపైన పాట‌ను ఆల‌పించారు.

ప‌ఠాన్ త‌ర్వాత ఖాన్ మ‌రో పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టించాడు. 'జ‌వాన్' టైటిల్ తోనే క్రేజ్ ఏర్ప‌డింది. ఇది విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అమెరికా స‌హా ప‌లు చోట్ల ఈ సినిమా టికెట్ల‌కు భారీ డిమాండ్ నెల‌కొంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇక అట్లీకి ఇది హిందీ డెబ్యూ సినిమా కావ‌డంతో అత‌డు చాలా శ్ర‌మించాడు. అత‌డు ఒక పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని బాలీవుడ్ లో తానేంటో నిరూపించాల‌నే త‌ప‌న‌తో ప‌ని చేసాడు.

నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించ‌గా ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా మెరుపు లాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని టాక్ ఉంది. త‌మిళంతో పాటు తెలుగులోను భారీగా రిలీజ్ చేసేందుకు కింగ్ ఖాన్ షారూక్ బిగ్ ప్లాన్ తో మూవ్ అవుతున్నాడు. ఖాన్ కి చెందిన‌ రెడ్ చిల్లీస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించింది.